logo

చేనేతరంగ ప్రముఖుడు వెంకటేశ్వర్‌రావు కన్నుమూత

చేనేత, జౌళిరంగాల అభివృద్ధికి కృషి చేసిన ప్రముఖుడు, ఉమ్మడి రాష్ట్రంలో ఆప్కో చీఫ్‌ జనరల్‌ మేనేజరుగా విధులు నిర్వహించిన ఆకురాతి వెంకటేశ్వర్‌రావు(84) కన్నుమూశారు. వృద్ధాప్య కారణాలతో బుధవారం రాత్రి నల్లకుంట పద్మకాలనీలోని

Published : 30 Sep 2022 03:12 IST

బాగ్‌లింగంపల్లి: చేనేత, జౌళిరంగాల అభివృద్ధికి కృషి చేసిన ప్రముఖుడు, ఉమ్మడి రాష్ట్రంలో ఆప్కో చీఫ్‌ జనరల్‌ మేనేజరుగా విధులు నిర్వహించిన ఆకురాతి వెంకటేశ్వర్‌రావు(84) కన్నుమూశారు. వృద్ధాప్య కారణాలతో బుధవారం రాత్రి నల్లకుంట పద్మకాలనీలోని నివాసంలో ఆయన మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. పలువురు చేనేత సామాజికవర్గ ప్రతినిధులు భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. చిన్న కూతురు నగరంలోనే నివసిస్తున్నారు. గురువారం సాయంత్రం కుటుంబీకులు, బంధువుల సమక్షంలో వెంకటేశ్వర్‌రావు అంత్యక్రియలు జరిగాయి.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts