logo

అక్రమ వసూళ్లకు పాల్పడిన కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

అక్రమ వసూళ్లకు పాల్పడిన ఓ కానిస్టేబుల్‌ను నగర పోలీసు కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు. శాలిబండ ఠాణా పరిధి కానిస్టేబుల్‌ సురేష్‌ వ్యాపార సముదాయాల వద్ద విధులు నిర్వహిస్తున్నప్పుడు అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డాడు.

Published : 30 Sep 2022 03:12 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: అక్రమ వసూళ్లకు పాల్పడిన ఓ కానిస్టేబుల్‌ను నగర పోలీసు కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు. శాలిబండ ఠాణా పరిధి కానిస్టేబుల్‌ సురేష్‌ వ్యాపార సముదాయాల వద్ద విధులు నిర్వహిస్తున్నప్పుడు అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డాడు. నగర పోలీసు ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు అందాయి. రెండునెలల క్రితం సాధారణబదిలీల్లో జూబ్లీహిల్స్‌ పోలీసు ఠాణాకు వచ్చాడు. శాలిబండలో అక్రమ వసూళ్లు నిర్ధారణ కావడంతో సీపీ సీవీఆనంద్‌ ఆయన్ని సస్పెండ్‌ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.


మాదక ద్రవ్యాలు తరలిస్తున్న ఏడుగురిపై కేసు

శంషాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, గోవా రాష్ట్రాల నుంచి మాదక ద్రవ్యాలను తరలిస్తున్న ముఠా గుట్టును ఎస్‌వోటీ పోలీసులు గురువారం రట్టు చేశారు. కొకైన్‌ 6 గ్రాములు, మరో 4 గ్రాముల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని గోవాకు చెందిన జాశ్వా నుంచి కొన్న పౌల్‌, దినేష్‌ శ్రీనివాస్‌, శశాంక్‌లు కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. ముందస్తు సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులు తొండుపల్లి టోల్‌ ప్లాజా వద్ద నిఘా పెట్టి వీరిని పట్టుకున్నారు. మధ్యవర్తులు సంజయ్‌, సందీప్‌లపై కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని