logo

పేటీఎంకు మొట్టికాయలు!

ఇ-కామర్స్‌ నిబంధనలు-2020ను పాటించని పేటీఎంకు వినియోగదారుల కమిషన్‌ మొట్టికాయలు వేసింది. ఓయూ క్యాంపస్‌ విద్యార్థి ఆకాశ్‌ భగేల్కర్‌.. పేటీఎం ద్వారా ‘ఉషా ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌’కు చెందిన ‘ఉషా జానోమ్‌ వండర్‌ స్టిచ్‌

Updated : 30 Sep 2022 04:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇ-కామర్స్‌ నిబంధనలు-2020ను పాటించని పేటీఎంకు వినియోగదారుల కమిషన్‌ మొట్టికాయలు వేసింది. ఓయూ క్యాంపస్‌ విద్యార్థి ఆకాశ్‌ భగేల్కర్‌.. పేటీఎం ద్వారా ‘ఉషా ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌’కు చెందిన ‘ఉషా జానోమ్‌ వండర్‌ స్టిచ్‌ ఆటోమెటిక్‌ జిగ్‌జాగ్‌ ఎలక్ట్రిక్‌ సూయింగ్‌ మెషీన్‌ (వైట్‌)’ను రెండేళ్ల క్రితం రూ.13,499 చెల్లించి కొనుగోలు చేయగా 2020 ఆగస్టు 15న డెలివరీ అయ్యింది. ఈక్రమంలో రూ.2 వేల క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కూడా వచ్చింది. అయితే కుట్టు యంత్రం నాసిరకంగా ఉండటం, కంట్రీ ఆఫ్‌ ఆరిజిన్‌ థాయిలాండ్‌లో ఉండటంతో మోసపోయానని ఫిర్యాదిదారుడు హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-1ను ఆశ్రయించి పరిహారం ఇప్పించాలని కోరారు. ఇ-కామర్స్‌ నిబంధనల మేరకు ఆన్‌లైన్‌లో విక్రయ సంస్థ పేరు, రిజిస్టర్‌ అయిందా.. లేదా.. బిజినెస్‌ పేరు, వస్తు సేవలు, నాణ్యత, ఫీచర్స్‌, జియోగ్రాఫిక్‌ చిరునామా, ప్రధాన కార్యాలయం, శాఖల వివరాలు, వెబ్‌సైట్‌ కస్టమర్‌ కేర్‌ నెంబర్‌, రేటింగ్‌, ఫీడ్‌బ్యాక్‌ ఇలా అన్నీ ప్రదర్శించాలి. అప్పుడు వాటిని పరిశీలించి కొనాలా వద్దా అని వినియోగదారుడు నిర్ణయించుకునే వీలుంటుంది. కానీ అవేమీ పేటీఎం ప్రదర్శించలేదని ఫిర్యాదిదారుడు పేర్కొనగా విచారించిన కమిషన్‌.. పేటీఎం, యుని వన్‌ ఇండియా ప్రయివేటు లిమిటెడ్‌ సంయుక్తంగా రూ.15 వేలు, 45 రోజుల్లో ఫిర్యాదీకి చెల్లించాలని సూచించింది.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని