logo

రెండు కులాల మధ్య స్థల వివాదం

ఓ స్థలం తమదంటే తమదని రెండు కులసంఘాల మధ్య తలెత్తిన వివాదం గురువారం ఆమనగల్లులో ఉద్రిక్తతకు దారితీసింది. పురపాలక కమిషనర్‌ శ్యాంసుందర్‌, పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు వివరాలు..

Published : 30 Sep 2022 03:29 IST
జాతీయ రహదారిపై ఆందోళనతో స్తంభించిన ట్రాఫిక్‌
లాఠీఛార్జి చేసి చెదరగొట్టిన పోలీసులు

దూసుకువస్తున్న వారిని అడ్డుకుంటున్న పోలీసులు

ఆమనగల్లు, న్యూస్‌టుడే: ఓ స్థలం తమదంటే తమదని రెండు కులసంఘాల మధ్య తలెత్తిన వివాదం గురువారం ఆమనగల్లులో ఉద్రిక్తతకు దారితీసింది. పురపాలక కమిషనర్‌ శ్యాంసుందర్‌, పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు వివరాలు.. పట్టణంలోని శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారి పక్కన ఖాళీ స్థలంలో ఓ కులంవారు ఈ నెల 26న చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ స్థలం ఆలయానికి వెళ్లే దారికి సంబంధించిందని, విగ్రహాన్ని ఉంచినవారిపై చర్యలు తీసుకోవాలని మరో కుల సంఘం ప్రతినిధులు అదేరోజు పుర కమిషనర్‌కు ఫిర్యాదుచేశారు. ఆ స్థలం తమదేనంటూ విగ్రహాన్ని ఉంచినవారు సంబంధిత పత్రాలను కమిషనర్‌ అందజేశారు. తమ ఫిర్యాదును పట్టించుకోవడం లేదంటూ ఓ కులస్తులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపై బైఠాయించారు. మరో వర్గం వారు టెంటు వేసుకుని ఆందోళనకు దిగారు. ర్యాలీగా వచ్చిన వారు వివాదాస్పద దారిలో వెళ్లేందుకు  ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. షాద్‌నగర్‌ ఏసీపీ కుషాల్కర్‌ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, నలుగురు ఎస్సైలు, అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. లాఠీలకు పనిచెప్పి ఇరువర్గాలను చెదరగొట్టారు. 10మందిపై కేసులు నమోదుచేసినట్లు సీఐ ఉపేందర్‌ తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని