logo

పండగకు ఇంటికి వెళ్తున్నారా..!

దసరా సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్తున్నారా..? సైబరాబాద్‌ పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు సూచిస్తున్నారు. కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర పలు సూచనలు చేశారు. రాత్రివేళ వీధుల్లో గస్తీ సైతం పెంచుతున్నామని వివరించారు.

Published : 30 Sep 2022 03:51 IST

దొంగల బారినపడకుండా  సైబరాబాద్‌ పోలీసుల సూచనలు

ఈనాడు- హైదరాబాద్‌: దసరా సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్తున్నారా..? సైబరాబాద్‌ పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు సూచిస్తున్నారు. కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర పలు సూచనలు చేశారు. రాత్రివేళ వీధుల్లో గస్తీ సైతం పెంచుతున్నామని వివరించారు.

సూచనలివీ..

ఊరెళ్లాల్సివస్తే బంగారు, వెండి నగలు, డబ్బును బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. లేదంటే రహస్యస్థలంలో దాచుకోవాలి.

సెక్యూరిటీ అలారం, మోషన్‌ సెన్సార్‌ ఏర్పాటుచేసుకోవాలి. సెంట్రల్‌ లాక్‌సిస్టమ్‌ ఉండాలి.

ఊరికెళ్లే ముందు దగ్గర్లోని పోలీసుస్టేషన్‌లో సమాచారమివ్వాలి.

నమ్మకమైన వాచ్‌మెన్‌లనే సెక్యూరిటీకి నియమించుకోవాలి. సీసీకెమెరాలతో ఆన్‌లైన్‌లో పరిశీలిస్తుండాలి.

ప్రధాన ద్వారానికి తాళం వేసినా కనిపించకుండా పరదాలు అడ్డుగా ఉంచాలి. ఇంటి లోపల, బయట కొన్ని లైట్లు వేసిఉంచాలి. గమనించాలని ఇరుగుపొరుగు వారికి చెప్పాలి.

కాలనీల్లో దొంగతనాలు అరికట్టేందుకు స్వచ్ఛంద కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై డయల్‌ 100 లేదా సైబరాబాద్‌ పోలీసు వాట్సాప్‌ నంబర్‌ 94906 17444కు సమాచారమివ్వాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని