logo

కూరగాయ కిలో రూ.100

వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయి.. రవాణా ఖర్చులు పెరిగాయి.. వీటికితోడు దళారులు నేరుగా రైతుల దగ్గరకే వెళ్లి కొని వాటినే హోల్‌సేల్‌, రైతుబజార్లకు తెచ్చి అమ్ముతున్నారు. ఇలా కారణాలు ఏవైనా కూరలు కొనాలంటే సామాన్యులకు

Published : 30 Sep 2022 03:51 IST

మాంసాహారంతో పోటీపడుతున్న శాకాహారం

ఈనాడు, హైదరాబాద్‌: వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయి.. రవాణా ఖర్చులు పెరిగాయి.. వీటికితోడు దళారులు నేరుగా రైతుల దగ్గరకే వెళ్లి కొని వాటినే హోల్‌సేల్‌, రైతుబజార్లకు తెచ్చి అమ్ముతున్నారు. ఇలా కారణాలు ఏవైనా కూరలు కొనాలంటే సామాన్యులకు భారమవుతోంది. ధరలు మాంసాహారంతో పడుతున్నాయి. కిలో కూరగాయ ఏదైనా రిటైల్‌ మార్కెట్‌లో రూ.100కు అటుఇటుగా భగ్గుమంటున్నాయి. ఆకుకూరలూ రూ.30-40 పెడితే కానీ నలుగురున్న ఇంట్లో పప్పులో వేసుకోడానికి రావు. కొత్తిమీర రూ.10 ఇస్తే 3 మొలకలున్న కట్ట రావడంలేదు. మునగ ఒకటి రూ.15-20 పలుకుతుంది. ఇక కూరగాయల ధరలు ఎవరైనా కిలోకి చెప్పడంలేదు. వెంకటరమణ కాలనీలో ఓ దుకాణదారుడు పావుకిలో ధరలే చెబుతుండటం పరిస్థితికి అద్దంపడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని