logo

ఔషధ పరీక్షలకు ఊతం.. చికిత్సలకు శ్రేయస్కరం

కొత్త ఔషధాన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ఎన్నోరకాల పరీక్షలు చేస్తుంటారు. ఆ మందు మనిషి శరీర భాగాలు లేదా వ్యాధులపై ఏ విధంగా పనిచేస్తోందో పరీక్షిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మనిషి అవయవాలను పోలిన

Published : 30 Sep 2022 03:51 IST

మార్కెట్‌లోకి 3డీ బయోప్రింటెడ్‌ మానవ అవయవాలు


రియాజీన్‌ ఇన్నోవేషన్స్‌లో చికిత్స విధానంపై పనిచేస్తున్న శాస్త్రవేత్త

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త ఔషధాన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ఎన్నోరకాల పరీక్షలు చేస్తుంటారు. ఆ మందు మనిషి శరీర భాగాలు లేదా వ్యాధులపై ఏ విధంగా పనిచేస్తోందో పరీక్షిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మనిషి అవయవాలను పోలిన 3డీ ముద్రిత భాగాలను తీసుకొచ్చింది నగరానికి చెందిన రియాజీన్‌ ఇన్నోవేషన్స్‌ అంకుర సంస్థ.

హెచ్‌సీయూలోని అస్పైర్‌ బయోనెస్ట్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రంలో ఈ సంస్థ పనిచేస్తోంది. సీఈవో, సహ వ్యవస్థాపకులుగా డాక్టర్‌ ఉదయ్‌సక్సేనా, వంగాల సుబ్రహ్మణ్యం వ్యవహరిస్తున్నారు. 3డీ బయోప్రింటెడ్‌ మానవ అవయవాలను ఇటీవల మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఇటీవల చెన్నైలో వీరి సంస్థ ఉత్తమ పరిశోధన సంస్థగా అవార్డుకు ఎంపికైంది. యువశాస్త్రవేత్తలు అర్పితారెడ్డి, బత్తుల సంజన, కె.శరణ్య, క్రాంతిమిహిర్‌ భాగస్వాములయ్యారు. ప్రధానంగా కొవిడ్‌, టైప్‌-2 మధుమేహ బాధితుల చికిత్సల్లో వినియోగించేలా అభివృద్ధిచేశారు. సీఈవో ఉదయ్‌ సక్సేనా మాట్లాడుతూ.. ఈ అవయవాలతో కొత్త ఔషధాల కోసం క్లినికల్‌ పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు వీలవుతుందన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts