logo

గ్రేటర్‌లో డెంగీ ఘంటికలు

నగరాన్ని డెంగీ గడగడలాడిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతోంది. జీహెచ్‌ఎంసీలో లెక్కల నమోదులో స్పష్టత కొరవడింది. జిల్లా ఎంటమాలజీ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జీహెచ్‌ఎంసీలోని ఎంటమాలజీ విభాగానికి సమన్వయం

Published : 30 Sep 2022 03:51 IST

అప్రమత్తత లోపించి ప్రాణాల మీదకు..

ఈనాడు, హైదరాబాద్‌

* శంషాబాద్‌ విమానాశ్రయ భద్రతాధికారిగా పనిచేస్తున్న  వ్యక్తి(34) నాలుగైదు రోజులుగా జ్వరంతో బాధపడుతూ, పరీక్ష చేయించుకోగా డెంగీ అని తేలింది. అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ప్లేట్‌లెట్లు పడిపోయి, షాక్‌ సిండ్రోమ్‌కు గురై మరణించినట్లు వైద్యులు తెలిపారు.

* రాజేంద్రనగర్‌లో ఓ బాలుడు డెంగీతో మృతి చెందాడు. జ్వరంతో బాధపడుతుండటంతో సాధారణ వైరల్‌ ఫీవర్‌లా భావించడం వల్ల పరిస్థితి విషమించింది. ఆసుపత్రిలో చేర్చినా ఫలితం లేకపోయింది.

నగరాన్ని డెంగీ గడగడలాడిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతోంది. జీహెచ్‌ఎంసీలో లెక్కల నమోదులో స్పష్టత కొరవడింది. జిల్లా ఎంటమాలజీ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జీహెచ్‌ఎంసీలోని ఎంటమాలజీ విభాగానికి సమన్వయం కొరవడటంతో కేసులు పూర్తిస్థాయిలో నమోదు కావట్లేదు. ఆస్పత్రుల్లో నిర్ధారణ అయినవే బల్దియాలో నమోదవుతున్నాయి. జ్వరం వచ్చిన అయిదు రోజులలోపు ఎన్‌ఎస్‌1 టెస్టుతో డెంగీ ఉందా లేదా గుర్తించవచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కోలుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అయిదు రోజులు దాటితే ఐజీఎం-ఎలీసా పరీక్ష తప్పనిసరి. డెంగీ ఫలితం ఆలస్యమైతే సీబీపీ చేయించుకోవాలి. ప్లేట్‌లెట్లు తగ్గుతున్నట్లు కనిపిస్తే అప్రమత్తం కావాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని