HarishRao: ఆహార కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు: మంత్రి హరీశ్‌రావు హెచ్చరిక

ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ఐపీఎం, ఆహార భద్రత విభాగం, ల్యాబ్‌ల పనితీరుపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐఐహెచ్ఎఫ్‌డబ్ల్యూ)లో హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు.

Published : 30 Sep 2022 17:24 IST

హైదరాబాద్: ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ఐపీఎం, ఆహార భద్రత విభాగం, ల్యాబ్‌ల పనితీరుపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐఐహెచ్ఎఫ్‌డబ్ల్యూ)లో హరీశ్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల ఆహార భద్రత విభాగం అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఆహార భద్రత అధికారులు లేని చోట జిల్లా వైద్యాధికారులే ఆ బాధ్యతలు నిర్వహించాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేయనున్నట్టు చెప్పారు. ఆహార భద్రతపై వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలని.. ఫుడ్ అడల్ట్రేషన్‌పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు. కల్తీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని.. ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించి ఎక్కడైనా కల్తీ జరిగినట్లు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని