logo

బస్సుల జాడ తెలిపేలా బోర్డులు

నగరంలో బస్సు వస్తుందో లేదో తెలియని అయోమయానికి తెరదించే పనిలో టీఎస్‌ఆర్టీసీ పడింది. ప్రధానమైన బస్టాపుల్లో బస్సుల రాకను గమనించి సమాచారం ఇచ్చే వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఒక ఎలక్ట్రిక్‌ డివైజ్‌ను ప్రధాన బస్టాపుల్లో ఉంచుతారు. దాని ద్వారా బస్సు ఎంత సమయానికి వచ్చిందో.

Published : 01 Oct 2022 03:25 IST

ఈనాడు - హైదరాబాద్‌

నగరంలో బస్సు వస్తుందో లేదో తెలియని అయోమయానికి తెరదించే పనిలో టీఎస్‌ఆర్టీసీ పడింది. ప్రధానమైన బస్టాపుల్లో బస్సుల రాకను గమనించి సమాచారం ఇచ్చే వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఒక ఎలక్ట్రిక్‌ డివైజ్‌ను ప్రధాన బస్టాపుల్లో ఉంచుతారు. దాని ద్వారా బస్సు ఎంత సమయానికి వచ్చిందో.. తెలుసుకుని తదుపరి స్టాపునకు ఎన్ని నిమిషాల్లో వెళ్తుందో సమాచారం అందిస్తారు. అక్కడ డిజిటల్‌ బోర్డు మీద కనిపించేలా ఏర్పాట్లు చేస్తారు. బస్సుల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికుల మొబైల్‌ ఫోనులో కూడా సమాచారం తెలిసేలా వ్యవస్థను కూడా రూపొందిస్తున్నారు. ఆర్డినరీ బస్సుకు కూడా జీపీఎస్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని.. అన్ని బస్సులు ట్రాకింగ్‌ యాప్‌ పరిధిలోకి వస్తాయని గ్రేటర్‌ జోన్‌ ఈడీ యాదగిరి తెలిపారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ బస్సు ట్రాకింగ్‌

నగరంలో తిరిగే బస్సులసమాచారాన్ని ఒక యాప్‌లోకి తీసుకురావాలని ఆర్టీసీ భావిస్తోంది. ఇప్పటికే టీఎస్‌ఆర్టీసీ బస్సు ట్రాకింగ్‌ వ్యవస్థ విమానాశ్రయానికి వెళ్లే బస్సుల సమాచారం అందిస్తోంది. నగరంలో తిరిగే వాటి కోసం గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ బస్సు ట్రాకింగ్‌ పేరుతో యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు సికింద్రాబాద్‌ ఆర్‌ఎం వెంకన్న తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts