logo

మౌలిక వసతుల కల్పనే లక్ష్యం

పల్లెల ప్రగతికి కృషి చేస్తున్నామని.. మౌలిక వసతులు కల్పిస్తున్నామని.. జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు అన్ని  పంచాయతీలు దరఖాస్తు చేసేలా సమాయత్తం చేశామని జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి అన్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు శిక్షణ తీసుకున్నారన్నారు. శుక్రవారం నిర్వహించిన ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో

Published : 01 Oct 2022 03:25 IST

న్యూస్‌టుడే: వికారాబాద్‌ కలెక్టరేట్‌

పంచాయతీ అధికారి మల్లారెడ్డితో ‘న్యూస్‌టుడే’

పల్లెల ప్రగతికి కృషి చేస్తున్నామని.. మౌలిక వసతులు కల్పిస్తున్నామని.. జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు అన్ని  పంచాయతీలు దరఖాస్తు చేసేలా సమాయత్తం చేశామని జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి అన్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు శిక్షణ తీసుకున్నారన్నారు. శుక్రవారం నిర్వహించిన ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో వివరించిన అంశాలు ఆయన మాటల్లో..  

పల్లె పురస్కారాలకు పోటీ:  జిల్లాలోని 566 పంచాయతీలు పల్లె పురస్కార పోటీల్లో పాల్గొంటున్నాయి. ఇందుకోసం తొమ్మిది అంశాలను ఆయా పంచాయతీలు అమలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం వనరులు సమకూర్చుకోవాలని పాలకవర్గాలకు సూచించాం. ప్రతి అంశంలో మూడు బహుమతులు ఉంటాయి. జిల్లా స్థాయిలో 27 బహుమతులు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కమిటీ బృందాలు పరిశీలించి ఎంపిక చేస్తారు. అవార్డులు సాధించే దిశగా ముందుకు సాగుతున్నాం.

చెత్త దిబ్బల నిర్వహణ: ప్రతి గ్రామంలో చెత్త దిబ్బలున్నాయి. పల్లెల్లో సేకరించిన చెత్తను అక్కడకి తరలించేలా చూస్తున్నాం. సుమారు 300 పంచాయతీల్లో తడిచెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. దీనిని పల్లె ప్రకృతి వనాల్లోని మొక్కలకు వినియోగిస్తున్నారు. మిగిలిన ఎరువును తక్కువ ధరకు రైతులకు విక్రయిస్తున్నారు.

పన్ను వసూళ్లు, నీటి సరఫరా: పంచాయతీలకు సంబంధించి    రూ.7.45 కోట్ల పన్నుల డిమాండ్‌ ఉండేది. ఇందులో సుమారుగా 99 శాతం వసూలు చేశాం. ప్రతి పంచాయతీకి మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నాం. ఈ పథకం అమలులోలేని గ్రామాల్లో బోర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. ఎద్దడి రాకుండా పాలకవర్గాలు తగిన చర్యలు తీసుకుంటాయి. ట్యాంకులను క్లోరినేషన్‌ చేస్తున్నాం.

పరిశుభ్రతకు పెద్దపీట: గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నాం. పల్లె ప్రగతి చేపట్టిన కార్యక్రమాలతో మంచి ఫలితాలు వచ్చాయి. రోడ్లపై చెత్త చేరకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. జిల్లావ్యాప్తంగా రెండు వేల మంది కార్మికులున్నారు. వీరు గ్రామాల్లో వివిధ పనులు నిర్వహిస్తున్నారు. బ్లీచింగ్‌ పౌడర్‌, హైపోక్లోరైడ్‌ ఇతర ద్రావణాలను పల్లెల్లో సిద్ధంగా ఉంచాం.

పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు: పంచాయతీ పరిధిలో, మున్సిపాలిటీల్లోని పాఠశాలలకు పారిశుద్ధ్య పనులు పంచాయతీ, పురపాలక కార్మికులే నిర్వహిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ఆసుపత్రుల్లోనూ చేస్తున్నారు. పాఠశాలల్లో పనులు చేయకపోతే, ప్రధానోపాధ్యాయుడు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులు చేయించుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని