logo

రూ.కోట్లు ఉన్నా.. తప్పని పాట్లు

తాండూరు పట్టణంలో అంతర్గతరోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. దారుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా, పూర్తి స్థాయిలో పనులు చేపట్టడం లేదు. పట్టణం రోజురోజుకు విస్తరిస్తున్నా, ఇందుకు తగినట్లుగా అంతర్గత మార్గాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Published : 01 Oct 2022 03:25 IST

బురదగా మారి..

న్యూస్‌టుడే, తాండూరు టౌన్‌: తాండూరు పట్టణంలో అంతర్గతరోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. దారుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా, పూర్తి స్థాయిలో పనులు చేపట్టడం లేదు. పట్టణం రోజురోజుకు విస్తరిస్తున్నా, ఇందుకు తగినట్లుగా అంతర్గత మార్గాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణ ప్రధాన, అంతర్గతరోడ్లు 163.80 కిలోమీటర్లు, సిమెంటువి 96.50, తారు రోడ్లు 11.10, మట్టివి 38. పాత కాలనీల్లో పూర్తి స్థాయిలో అంతర్గత రోడ్లు లేక స్థానికులు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీల్లో ఇదే దుస్థితి నెలకొంది. ఎడతెరపిలేని వర్షాలకు దారులు బురదమయంగా మారాయి.  పట్టణంలోని వివిధ వార్డుల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం 2019-2020లో 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ.3.12 కోట్లు మంజూరు చేసింది. వీటితో పట్టణ వ్యాప్తంగా సిమెంటు రోడ్లు, మురుగు కాల్వలు మొత్తం 128 పనులు చేపట్టాల్సి ఉంది. వీటిల్లో ఇప్పటి వరకు కేవలం 38 మాత్రమే జరిగాయి. నిధులున్నా పనులు ముందుకు సాగకపోవడమేమిటని పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు.సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో స్థానికులే తాత్కాలికంగా దారులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆదర్శ తులసీనగర్‌, భవానీనగర్‌, సాయిపూరు ప్రాంతాల్లో స్థానికులు శ్రమదానంతో నాపరాతి ముక్కలతో దారులు వేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని