logo

సీఎం కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారు: భాజపా

మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని భాజపా నాయకులు మాజీ మంత్రి చంద్రశేఖర్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం బంట్వారం మండలం రొంపల్లి, బంట్వారం, తొర్మామిడి, యాచారం, మాలసోమారం తదితర

Published : 01 Oct 2022 03:25 IST

మాట్లాడుతున్న మాజీమంత్రి చంద్రశేఖర్‌, చిత్రంలో మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, నాయకులు

బంట్వారం, న్యూస్‌టుడే: మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని భాజపా నాయకులు మాజీ మంత్రి చంద్రశేఖర్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం బంట్వారం మండలం రొంపల్లి, బంట్వారం, తొర్మామిడి, యాచారం, మాలసోమారం తదితర గ్రామాల్లో పర్యటించి పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో సీఎం  కేసీఆర్‌ ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. దళితుల విషయంలో ఆయనకు చిత్తశుద్ధి లేదన్నారు. ఎంత మందికి దళితబంధు ఇచ్చారో ప్రజలకు లెక్క చెప్పాలని డిమాండ్‌ చేశారు.  నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారన్నారు.  కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి, మండల అధ్యక్షుడు మహేష్‌, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని