logo

పేరుకుపోతున్న విద్యుత్తు బకాయిలు

సామాన్యులు విద్యుత్తు బిల్లులు చెల్లించడం ఆలస్యమైతే సిబ్బంది ఇంటికెళ్లి వసూలు చేస్తారు. లేదంటే కనెక్షన్‌ తొలగిస్తారు. అయితే ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సినవి నెలల తరబడి పేరుకుపోతున్నా మౌనం వహిస్తున్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని బొంరాస్‌పేట, కొడంగల్‌

Updated : 01 Oct 2022 05:36 IST

ప్రభుత్వ కార్యాలయాల్లో ఇదీ తీరు

న్యూస్‌టుడే, కొడంగల్‌ గ్రామీణం: సామాన్యులు విద్యుత్తు బిల్లులు చెల్లించడం ఆలస్యమైతే సిబ్బంది ఇంటికెళ్లి వసూలు చేస్తారు. లేదంటే కనెక్షన్‌ తొలగిస్తారు. అయితే ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సినవి నెలల తరబడి పేరుకుపోతున్నా మౌనం వహిస్తున్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని బొంరాస్‌పేట, కొడంగల్‌, దౌల్తాబాద్‌ మండలాల పరిధిలో 188 ప్రభుత్వ పాఠశాలలతోపాటు, వివిధ శాఖల కార్యాలయాలకు కనెక్షన్లు ఉన్నాయి. వీటి పరిధిలోని వివిధ శాఖల కార్యాలయాల నుంచి ప్రస్తుతం రూ.17.71 లక్షలు బకాయిలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

అమలుకు నోచని ముందస్తు చెల్లింపు: ప్రభుత్వ కార్యాలయాల్లో ముందస్తు చెల్లింపు విధానంతో (పోస్టుపెయిడ్‌) మీటర్లు బిగించేందుకు రెండేళ్లుగా కసరత్తు చేస్తున్నారు. అయినా అమలులో ఉన్నతాధికారుల నుంచి సరైన మార్గదర్శకాలు రావడంలేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. కొడంగల్‌ పట్టణంలో ఏడాది కిందటనే ప్రయోగాత్మకంగా 12 ప్రభుత్వ కార్యాలయాల్లో మీటర్లు బిగించారు. అయితే పాత విధానంతో కరెంట్‌ సరఫరా కొనసాగడంతో నెల వారీ బిల్లుల చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. కార్యాలయాల నిర్వహణకు నిధులు మంజూరు కాకపోవటంతో బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని ఆయా శాఖల అధికారులు పేర్కొంటున్నారు. కార్యాలయాల వారీగా చెల్లించాల్సినవి ఇలా కొడంగల్‌ అతిథి  గృహం  రూ.1.58 లక్షలు, ప్రభుత్వ పాఠశాలలు రూ.8.40లక్షలు, పోలీసుశాఖ రూ.4.23లక్షలు, ఆస్పత్రులు రూ.1.47లక్షలు, అటవీశాఖ రూ.1.60 లక్షలు.


ప్రతి నెలా అడుగుతున్నాం

నవీన్‌కుమార్‌, విద్యుత్తుశాఖ ఏడీ, కొడంగల్‌

కొడంగల్‌ ఏడీ కార్యాలయం పరిధిలో ప్రతి నెలా విద్యుత్తు బిల్లులు చెల్లించాలని ఆయా శాఖల అధికారులను అడుగుతున్నాం. బకాయిలు పెరుగుతున్నాయని సహకరించాలని కోరాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని