logo

ఏజెన్సీ సిబ్బంది ఆగడాలకు అడ్డుకట్ట వేద్దామిలా..

అసలే గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1105తో జేబుకు చిల్లుపడుతుంటే.. మరోపక్క డెలీవరీ ఏజెన్సీ సిబ్బంది రూ.30 నుంచి రూ.100 వరకూ డిమాండ్‌ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇవ్వకుంటే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సమ్యలపై ఫిర్యాదులు అందిన

Published : 01 Oct 2022 03:11 IST

ఈనాడు, హైదరాబాద్‌: అసలే గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1105తో జేబుకు చిల్లుపడుతుంటే.. మరోపక్క డెలీవరీ ఏజెన్సీ సిబ్బంది రూ.30 నుంచి రూ.100 వరకూ డిమాండ్‌ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇవ్వకుంటే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సమ్యలపై ఫిర్యాదులు అందిన వెంటనే వారికి జరిమానా విధించడంతో పాటు మరోసారి ఇలా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాలశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

నిబంధనలు ఇలా..గోదాముకు వెళ్లి సిలిండర్‌ తీసుకుంటే బిల్లులో రూ.8 తగ్గించాలి. సిలిండర్‌ డోర్‌ డెలివరీ సమయంలో ప్రత్యేక పరికరంతో రీఫిల్‌ నిర్ణీత బరువు వినియోగదారులకు చూపించాలి. ఇవేమీ పాటిస్తున్న దాఖాలాలు లేవు.

ఇలా ఫిర్యాదు చేయండి.. సేవా లోపాలపై ఆయిల్‌ కంపెనీల సేల్స్‌ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. వీరి నంబర్లను డిస్ట్రిబ్యూషన్‌ ఏజెన్సీ కార్యాలయాల్లో తప్పనిసరిగా ప్రదర్శిస్తారు. పౌరసరఫరాలశాఖ ఏఎస్‌వో అధికారులకు ఫిర్యాదు చేయాలనుకుంటే సర్కిళ్లవారీగా http://www.civilsupplies.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు. లేదా నేషనల్‌ కన్జ్యూమర్‌ హెల్ప్‌లైన్‌ 1800-11-4000 నంబర్‌ను సంప్రదించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని