logo

రేషన్‌ బియ్యం పక్కదారి

ఓ వైపు రేషన్‌ కార్డుల కోసం వేలాది మంది ఎదురుచూస్తుంటే మరో వైపు టన్నుల కొద్దీ బియ్యం పక్కదారి పడుతున్నాయి. గ్రేటర్‌ పరిధిలో ఏటా 2 వేల టన్నులకు పైగా బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఏటా సుమారు 600కు పైగా కేసులు నమోదవుతున్నాయి. అనధికారికంగా ఇతర రాష్ట్రాలకు

Published : 01 Oct 2022 03:11 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఓ వైపు రేషన్‌ కార్డుల కోసం వేలాది మంది ఎదురుచూస్తుంటే మరో వైపు టన్నుల కొద్దీ బియ్యం పక్కదారి పడుతున్నాయి. గ్రేటర్‌ పరిధిలో ఏటా 2 వేల టన్నులకు పైగా బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఏటా సుమారు 600కు పైగా కేసులు నమోదవుతున్నాయి. అనధికారికంగా ఇతర రాష్ట్రాలకు చేరేది ఇంత కంటే ఎక్కువే. నగరంలో గతేడాది 230 పీడీఎస్‌ డైవర్షన్‌ కేసులు నమోదవగా.. 4,35,250 కిలోల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 181 కేసులు నమోదవగా 3,59,797 కిలోల బియ్యం పట్టుబడ్డాయి. హైదరాబాద్‌ జిల్లాలో మొత్తం 6,36,617 కార్డుదారులుండగా ప్రతి నెలా 14 వేల మెట్రిక్‌ టన్నులు పంపిణీ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 5,59,788 కార్డుదారులుండగా 20 వేలు, మేడ్చల్‌ జిల్లాలో 5,24,449 కార్డుదారులుండగా 18 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే కోటాతో ఇది మరింత పెరిగింది. రీసైక్లింగ్‌ దందా చేస్తున్నట్లు సమాచారం అందగానే కేటుగాళ్ల స్థావరాలపై దాడి చేస్తున్న పౌరసరఫరాల శాఖ.. లబ్ధిదారుల నుంచి సేకరిస్తున్న ముఠాలను అరికట్టడంలో విఫలమవుతోంది. ఈ సేకరణలో నగరంలోని కొందరు మురికివాడల పిల్లలనూ చేరుస్తుండటం గమనార్హం. ఇలా సేకరించిన బియ్యాన్ని నగర శివార్లలోని గోడౌన్లకు చేర్చి, అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్తోంది. అక్కడి కోళ్ల దాణా పరిశ్రమలు, హోటళ్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని