logo

4 నెలలు.. కీలక పరిణామాలు!

జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచారం కేసు.. 4 నెలలుగా ఎన్నో పరిణామాలు.. మరెన్నో మలుపులు. సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తులో జూబ్లీహిల్స్‌ పోలీసులు చాలా కష్టపడ్డారు. నగర సీపీ సీవీ ఆనంద్‌ దర్యాప్తు, విచారణపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ  దిశానిర్దేశం చేశారు.

Published : 01 Oct 2022 03:11 IST

జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచారం కేసులో మలుపులు

ఈనాడు, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచారం కేసు.. 4 నెలలుగా ఎన్నో పరిణామాలు.. మరెన్నో మలుపులు. సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తులో జూబ్లీహిల్స్‌ పోలీసులు చాలా కష్టపడ్డారు. నగర సీపీ సీవీ ఆనంద్‌ దర్యాప్తు, విచారణపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ  దిశానిర్దేశం చేశారు.

ఎప్పుడేం జరిగిందంటే..

* మే 28 శనివారం వారాంతపు సందడి. జూబ్లీహిల్స్‌లో పబ్‌లో ఓ కళాశాలకు చెందిన విద్యార్థులు వేడుక నిర్వహించారు. స్నేహితురాలి ఆహ్వానంతో పార్టీలో పాల్గొన్న బాలిక వేడుక ముగిశాక ఇంటికి బయల్దేరింది. అప్పటికే బాలిక కదలికలను గమనిస్తూ వచ్చిన కుర్రాళ్లు నెమ్మదిగా ముగ్గులోకి లాగారు. బాలికను ఇంటివద్ద దింపుతామంటూ మాటలతో జూబ్లీహిల్స్‌లోని బేకరీకు తీసుకెళ్లారు. అక్కడ బాలికను మరో కారులోకి మార్చి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

* జూన్‌ 2 కూతురు మెడపై గాట్లను గమనించి తల్లి నిలదీయటంతో అసలు విషయం వెలుగు చూసింది. ఘటనలో ప్రజాప్రతినిధి తనయుడు ఉన్నాడని ప్రచారం జరగటంతో కేసు సంచలనంగా మారింది. రెండు కార్లు, నిందితులను గుర్తించేందుకు జూబ్లీహిల్స్‌ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

* జూన్‌ 3 సామూహిక అత్యాచారం కేసులో ఆరుగురి ప్రమేయం ఉన్నట్టు సీసీ కెమెరాల ఫుటేజ్‌ ఆధారంగా నిర్దారణకు వచ్చారు.

* జూన్‌ 5-6 తేదీల్లో సామూహిక అత్యాచారానికి గురైన బాలిక, పాల్పడిన యువకుల వీడియోలు, చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. నలుగురు నిందితులను, వీడియోలను బహిర్గతం చేసిన పాతబస్తీకి చెందిన యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

* జూన్‌ 8 కల్లా ఈ కేసులో మొత్తం ఆరుగురుని అరెస్ట్‌ చేశారు. వీరిలో షాదుద్దీన్‌ మాలిక్‌ (18) మేజర్‌ కావటంతో జైలుకు తరలించారు. మిగిలిన ఐదుగురు మైనర్లుగా నిర్దారణవటంతో జువెనైల్‌ హోంకు తరలించారు.

* జూన్‌ 11న ఉస్మానియా ఆసుపత్రిలో ఐదుగురు మైనర్లకు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించారు. ః సెప్టెంబరు 2న ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించాలంటూ నగర పోలీసులు నాంపల్లి న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని