logo

టీ ఫైబర్‌తో ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్‌ సేవలు

రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో తెచ్చేందుకు దేశంలోనే తొలిసారి టీ ఫైబర్‌ పేరుతో ఫైబర్‌ కేబుల్‌ నిర్మాణం చేపడుతోందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తెలిపారు. కొవిడ్‌ వల్ల ఫైబర్‌ పనులకు అంతరాయం కలిగిందని, వచ్చే ఏడాది నాటికి పూర్తి

Published : 01 Oct 2022 03:11 IST

టీటా ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌

రాయదుర్గం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో తెచ్చేందుకు దేశంలోనే తొలిసారి టీ ఫైబర్‌ పేరుతో ఫైబర్‌ కేబుల్‌ నిర్మాణం చేపడుతోందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తెలిపారు. కొవిడ్‌ వల్ల ఫైబర్‌ పనులకు అంతరాయం కలిగిందని, వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టీటా) దశాబ్ది (పదేళ్లు) ఉత్సవాలు శుక్రవారం రాయదుర్గంలోని టీ హబ్‌లో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్‌కు మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సందీప కుమార్‌ మక్తాలతో ఈ సందర్భంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు.  టీటా అధ్యక్షుడు సందీప్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని