logo

విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.200 కోట్లు ఇవ్వాలి

విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.200 కోట్లు ఇవ్వాలని తెలంగాణ బీసీ కుల సంఘాల ఐకాస ఛైర్మన్‌ కుందారం గణేశ్‌చారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. శుక్రవారం అలీకేఫ్‌ చౌరస్తాలో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు నాగారం భాస్కర్‌చారి అధ్యక్షతన జరిగిన

Published : 01 Oct 2022 03:11 IST

భాస్కర్‌చారిని సన్మానిస్తున్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, కుందారం గణేశ్‌చారి.

చిత్రంలో  మదన్‌మోహన్‌, విశ్వకర్మ సంఘాల నేతలు

అంబర్‌పేట, న్యూస్‌టుడే: విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.200 కోట్లు ఇవ్వాలని తెలంగాణ బీసీ కుల సంఘాల ఐకాస ఛైర్మన్‌ కుందారం గణేశ్‌చారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. శుక్రవారం అలీకేఫ్‌ చౌరస్తాలో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు నాగారం భాస్కర్‌చారి అధ్యక్షతన జరిగిన అంబర్‌పేట విశ్వకర్మ సంఘం దశమ వార్షికోత్సవం, విరాట్‌ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో ఆయన మాట్లాడారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌కు పాలమండలిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఐదెకరాలు, రూ.5 కోట్లు కేటాయించిందన్నారు. తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేములవాడ మదన్‌మోహన్‌, కార్పొరేటర్‌ విజయ్‌కుమార్‌గౌడ్‌, పులి జగన్‌, ఆనంద్‌గౌడ్‌, మురళీకృష్ణ, కత్తుల సుదర్శన్‌, నాగభూషణంచారి, శ్రీహరిచారి, నరేశ్‌చారి, రమేశ్‌చారి, జగన్‌చారి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని