logo

చోరీలు మానడం లేదని ఘాతుకం

మద్యానికి బానిసై.. దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడిని తల్లి, సోదరుడు కలిసి హత్య చేశారు. వారిద్దని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మెదక్‌ అదనపు ఎస్పీ బాలస్వామి, డీఎస్పీ సైదులు తెలిపారు. ఈ నెల 18న హవేలిఘనపూర్‌ మండలం నాగాపూర్‌లో జరిగిన హత్యకు

Published : 01 Oct 2022 03:11 IST

యువకుడిని హత్య చేసిన తల్లి, సోదరుడు

వివరాలు వెల్లడిస్తున్న అదనపు ఎస్పీ బాలస్వామి

హవేలిఘనపూర్‌, న్యూస్‌టుడే: మద్యానికి బానిసై.. దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడిని తల్లి, సోదరుడు కలిసి హత్య చేశారు. వారిద్దని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మెదక్‌ అదనపు ఎస్పీ బాలస్వామి, డీఎస్పీ సైదులు తెలిపారు. ఈ నెల 18న హవేలిఘనపూర్‌ మండలం నాగాపూర్‌లో జరిగిన హత్యకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. నాగపూర్‌ గ్రామానికి చెందిన చింతకింది భూమవ్వ-సంగయ్య దంపతులకు ఇద్దరు కుమారులు దేవేందర్‌(27), కృష్ణ. పెద్ద కుమారుడు దేవేందర్‌ మద్యం తాగ నిత్యం భార్యతో గొడవ పడుతుండటంతో ఆమె విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. ఈ నెల 15న గ్రామానికి చెందిన నర్సారెడ్డి కిరాణ దుకాణంలో దేవేందర్‌, గ్రామానికి చెందిన నరేష్‌తో కలిసి దొంగతనం చేశారని ఆరోపిస్తూ మర్నాడు గ్రామపెద్దలు పంచాయతీ నిర్వహించి ఇరువురికి జరిమానా విధించారు. దీంతో దేవేందర్‌కు ఎంత చెప్పినా వైఖరిని మార్చుకోకపోవడం, కుటుంబానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నాడని తల్లి భూమవ్వ, చిన్న కుమారుడు కృష్ణ భావించారు. ఈ 17న రాత్రి 11 గంటలకు పథకం ప్రకారం నిద్రిస్తున్న దేవేందర్‌ నోటిలో ఎలుకల మందు పోసి హత్య చేశారు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరించారు. 18న అంత్యక్రియలు చేశారు. అనంతరం కులపెద్దలు దేవేందర్‌ను హత్య చేసినందుకు పంచాయతీ నిర్వహించి జరిమానా విధించారు. ఈ నెల 26న పోలీసుల దృష్టికి ఈ విషయం రావడంతో పంచాయతీ కార్యదర్శి సురేష్‌ ఫిర్యాదు ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. తల్లి, సోదరుడు కలిసి హత్య చేసినట్లు ఒప్పుకొన్నారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నేరాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా విషయాన్ని బయటకు రాకుండా చట్టాన్ని అతిక్రమించిన ఇద్దరు గ్రామపెద్దలను నిందితులుగా గుర్తించగా వారు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో మెదక్‌ గ్రామీణ సీఐ విజయ్‌, ఎస్‌ఐలు మోహన్‌రెడ్డి, మురళి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని