logo

బతుకుదెరువుకు వచ్చి... విగత జీవిగా మారి!

నిత్యం ఈత వనాలకు వెళ్లి.. ముడి సరకు సేకరించి.. గంపలు(బుట్టలు) తయారు చేసి సంతల్లో విక్రయించగా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి.. ఆ సంతలోనే ఒక్క సారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లి అక్కడికక్కడే మృతి

Published : 01 Oct 2022 03:11 IST

వట్పల్లి, న్యూస్‌టుడే: నిత్యం ఈత వనాలకు వెళ్లి.. ముడి సరకు సేకరించి.. గంపలు(బుట్టలు) తయారు చేసి సంతల్లో విక్రయించగా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి.. ఆ సంతలోనే ఒక్క సారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మెదక్‌ జిల్లా అల్లాదర్గుం మండలం గడిపెద్దాపూర్‌ గ్రామానికి చెందిన ఎరుకల నర్సింహులు(38) బుట్టలను తయారు చేసి సంతల్లో విక్రయించేవారు. శుక్రవారం వట్పల్లిలో సంతకు బుట్టలు తీసుకొని వచ్చాడు. వాటిని రహదారి పక్కన పెట్టి విక్రయిస్తుండగా ఒక్కసారిగా అపస్మాకర స్థితిలోకి వెళ్లి నేలపైనే పడిపోయాడు. అక్కడున్న వారు గమనించి గమనించి.. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. వట్పల్లి ఠాణా పోలీసులను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని