logo

తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో స్నేహితుడి హత్య

తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన ఘర్షణ హత్యకు దారితీసింది. ఈ సంఘటన ఫతేనగర్‌లో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ ముత్తుయాదవ్‌ తెలిపిన వివరాలు ఇలా.. మహారాష్ట్రలోని అమరావతికి

Published : 01 Oct 2022 03:11 IST

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన ఘర్షణ హత్యకు దారితీసింది. ఈ సంఘటన ఫతేనగర్‌లో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ ముత్తుయాదవ్‌ తెలిపిన వివరాలు ఇలా.. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఎం.నీలేష్‌ మధుకరరావు రామ్‌టేకే(34), ఔరంగాబాద్‌కు చెందిన మహేష్‌(30)లు జీవనోపాధి నిమిత్తం నగరానికి చేరుకుని క్యాటరింగ్‌ పనులు చేసేవారు. ఫతేనగర్‌లోని ఒక గదిలో ఉండేవారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు మహేష్‌ నుంచి నీలేష్‌ రూ.16వేల వరకు అప్పు తీసుకున్నాడు. ఈ కమ్రంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. మహేష్‌ పలుమార్లు డబ్బులు అడిగినప్పటికీ నీలేష్‌ ఇవ్వట్లేదు. డబ్బు చెల్లించకుంటే అంతు చూస్తానని నీలేష్‌ను మహేష్‌ హెచ్చరించాడు. ఈ క్రమంలో గురువారం నీలేష్‌తో పాటు ప్రస్తుతం అతనితో కలిసి గదిలో ఉంటున్న మనోజ్‌లు టీ తాగేందుకు బయటకు వచ్చారు. మహేష్‌, మిత్రుడు రావుసాహెబ్‌ వారికి ఎదురుపడ్డారు. తీసుకున్న అప్పు ఇవ్వమని మహేష్‌ మరోసారి వత్తిడి చేశాడు. నీలేష్‌ నిరాకరించాడు. ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. పథకం ప్రకారం మహేష్‌.. తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో దాడిచేశాడు. నీలేష్‌ కిందపడిపోయాడు. మహేష్‌, రావుసాహెబ్‌లు పారిపోయారు. నీలేష్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. నిందితులైన మహేష్‌, రావుసాహెబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని