logo

చిత్ర వార్తలు

నగరంలో ఆలయాలు జగన్మాత స్మరణతో మార్మోగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నగరంలో పలు ప్రధాన ఆలయాల్లో అమ్మవార్లు ప్రత్యేక అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

Published : 01 Oct 2022 03:11 IST

నమోనమామి.. జగన్మాత స్మరామి

లలితాదేవి అలంకరణలో జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి

నగరంలో ఆలయాలు జగన్మాత స్మరణతో మార్మోగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నగరంలో పలు ప్రధాన ఆలయాల్లో అమ్మవార్లు ప్రత్యేక అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

మహాలక్ష్మి రూపంలో బల్కంపేట ఎల్లమ్మ

బంగారు పట్టుచీర, నగదుతో బల్కంపేట ఎల్లమ్మ తల్లి మూలవిరాట్‌ అలంకరణ

స్కందమాతగా లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి


ప్రకృతి పండగలో పరదేశీ

శంషాబాద్‌ నర్కూడ  సమీపంలోని అమ్మపల్లి దేవాలయ  ప్రాంగణంలో శుక్రవారం రాత్రి   బతుకమ్మ వేడుకలు జరిగాయి. అమెరికా కాన్సుల్‌  జనరల్‌ జెన్నిఫర్‌  లార్సన్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత   పాల్గొన్నారు. తర్వాత కోనేరులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

-న్యూస్‌టుడే, శంషాబాద్‌


లలితా త్రిపుర సుందరి..

భక్త అభయంకరితాండూరు నగరేశ్వర ఆలయంలో కన్యకా పరమేశ్వరిని శుక్రవారం లలితా త్రిపుర సుందరిగా అలంకరించారు. దేవీనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి క్లబ్‌, ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌, నగరేశ్వర దేవాలయం భజన మండలి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి.

- న్యూస్‌టుడే, తాండూరు టౌన్‌


జిల్లా పోలీసు కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు 

కార్యక్రమంలో ఎస్పీ కోటిరెడ్డి, అధికారులు

వికారాబాద్‌ కలెక్టరేట్‌, వికారాబాద్‌, న్యూస్‌టుడే: జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా పోలీసు అధికారి ఎన్‌.కోటిరెడ్డి పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత మహిళలకు గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రషీద్‌, డీఎస్పీ సత్యనారాయణ, మహిళా సీఐ ప్రమీల, ఆర్‌ఐలు రత్నం, అచ్యుతరావు పోలీసు సంఘం అధ్యక్షుడు అశోక్‌, పోలీసు సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


విభాగినికెక్కిన వినోదం!

గచ్చిబౌలి ఇందిరానగర్‌ నుంచి శాంతి సరోవర్‌ రహదారి ఇరుపక్కలా  కొందరు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు.  వినోదపు డిష్‌ యాంటీనాలను ఎవరికి వారు ఇలా వరుసగా రహదారిలో డివైడర్‌    మధ్య చిన్న చెట్ల చెంత ఏర్పాటు చేసుకున్నారు


పాపం శునకం..  ప్రాణాలతో చెలగాటం

ప్లాస్టిక్‌ వ్యర్ధాలు మూగజీవాలకు ఎంత హానికరమో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. ఆహారం కోసం ప్లాస్టిక్‌ డబ్బాలో తలదూర్చిందో శునకం. తిన్నాక డబ్బాలో నుంచి తల బయటకు రాక అవస్థలు పడుతోంది. హయత్‌ నగర్‌లో కనిపించిన చిత్రమిది.  


ఫార్ములా.. ఈ రూటే సెపరేటు!

దేశంలోనే తొలిసారిగా నగరంలో ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న అంతర్జాతీయ ఫార్ములా ఈ కారు రేసింగ్‌ కోసం నెక్లెస్‌ రోడ్డులో  2.8 కిమీ. మార్గం అనుకూలంగా ఉండటంతో హెచ్‌ఎండీఏ అధికారులు ట్రాక్‌ నిర్మాణం మొదలుపెట్టారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని