KTR: ఓ సోదరుడిగా కిషన్ రెడ్డిని ఎంతో గౌరవిస్తా.. కానీ..: కేటీఆర్‌

తెలంగాణకు మెడికల్‌ కళాశాలల కేటాయింపు అంశంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు.

Updated : 01 Oct 2022 11:59 IST

హైదరాబాద్: మెడికల్ కళాశాలల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణకు కేంద్రం 9 మెడికల్ కళాశాలలు మంజూరు చేసిందని కిషన్ రెడ్డి చెప్పడంలో ఏమాత్రం వాస్తవం లేదని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు తన ట్విటర్ ద్వారా కేటీఆర్‌ ప్రకటించారు. ‘‘ఓ సోదరుడిగా కిషన్ రెడ్డిని ఎంతో గౌరవిస్తా. కానీ అసత్యాలు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు. అబద్ధాలు మాట్లాడే కిషన్ రెడ్డికి తన తప్పును అంగీకరించే ధైర్యం కూడా లేదు’’ అని కేటీఆర్ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని