logo

శుభ్రం చేసుకో..సంపాదించుకో

బహిరంగ మూత్ర విసర్జనకు, చెత్తకుప్పలకు నిలయంగా మారుతోన్న ట్రాన్స్‌ఫార్మర్లపై జీహెచ్‌ఎంసీ దృష్టిపెట్టింది. కాలిబాటపై అడ్డుగోడలా, చెత్తకుప్పలకు ప్రతిరూపంలా, ముళ్ల పొదలకు మరోపేరులా ఉండే విద్యుత్తు నియంత్రికలను అందంగా తీర్చిదిద్దేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేసింది.

Published : 02 Oct 2022 03:50 IST

 ట్రాన్స్‌ఫార్మర్ల స్థలం ప్రైవేటు నిర్వహణకు

ఎర్రమంజిల్‌ రోడ్డుపై కాలిబాటపై నిర్వహణలేక అధ్వానంగా కనిపిస్తోన్న ట్రాన్స్‌ఫార్మర్‌

ఈనాడు, హైదరాబాద్‌: బహిరంగ మూత్ర విసర్జనకు, చెత్తకుప్పలకు నిలయంగా మారుతోన్న ట్రాన్స్‌ఫార్మర్లపై జీహెచ్‌ఎంసీ దృష్టిపెట్టింది. కాలిబాటపై అడ్డుగోడలా, చెత్తకుప్పలకు ప్రతిరూపంలా, ముళ్ల పొదలకు మరోపేరులా ఉండే విద్యుత్తు నియంత్రికలను అందంగా తీర్చిదిద్దేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేసింది. ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ ఉండే దుర్భర పరిస్థితులను చక్కదిద్ది, ఆ ప్రాంతాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దే సంస్థలకు.. ఆయా ప్రాంతాల్లో పదేళ్లపాటు ప్రకటనలు ఏర్పాటు చేసుకునేలా అనుమతి ఇస్తామంటోంది. అందులో భాగంగా ఇంజినీర్లు ఇప్పటికే టెండరు నోటిఫికేషన్‌ విడుదల చేశారు.  
ఉభయతారకంగా విధానం..
నగరంలో అపరిశుభ్రంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను చక్కగా తీర్చిదిద్దాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. వాటిని శుభ్రంగా మార్చడంతోపాటు, ఆ విధానాన్ని ఆదాయ వనరుగా మార్చుకునేలా కార్యాచరణ రూపొందించింది. దాని ప్రకారం.. గుత్తేదారు సంస్థలు ఆయా ట్రాన్స్‌ఫార్మర్ల పరిసరాలను సొంత నిధులతో అభివృద్ధి చేయాలి. జాలీ నిర్మాణం, ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ ఉండే చెత్త కుప్పలు, మట్టి, పిచ్చి మొక్కలను తొలగించి ఇసుక, కంకర వేయాలి. రంగులతో ఆ ప్రాంతాన్ని ముస్తాబు చేయాలి. అలా చేసినందుకు గుత్తేదారు సంస్థ రోడ్డు వైపు కొంత భాగంలో ప్రకటనలు చేసుకోవచ్చు. వాటి ద్వారా ఆదాయం పొందొచ్చు. అదే సమయంలో జీహెచ్‌ఎంసీకి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆ మేరకు జీహెచ్‌ఎంసీ ప్రకటనల విభాగం మొదటి దశలో జోన్‌కు వెయ్యి ట్రాన్స్‌ఫార్మర్లు, మొత్తం 6వేల విద్యుత్తు నియంత్రికలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని