logo

బస్సులు, రైళ్లు కిటకిట.. సీట్లకు కటకట

దసరా సమీపిస్తుండడంతో నగరం నుంచి సొంతూళ్లకు వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా భయం చాలా వరకు పోవడంతో రాజధాని నుంచి లక్షల సంఖ్యలో జనం అటు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు ఇటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు తరలి వెళ్తున్నారు.

Published : 02 Oct 2022 03:50 IST

వరంగల్‌ వైపు వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతున్న ఉప్పల్‌ బస్టాండు

ఈనాడు- సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: దసరా సమీపిస్తుండడంతో నగరం నుంచి సొంతూళ్లకు వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా భయం చాలా వరకు పోవడంతో రాజధాని నుంచి లక్షల సంఖ్యలో జనం అటు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు ఇటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు తరలి వెళ్తున్నారు. సాధారణంగా ఏపీకి సంక్రాంతి పండగ సమయంలో లక్షల మంది వెళ్తుంటారు. దీనికి భిన్నంగా దసరాకు వారం ముందు నుంచి సొంతూరి బాట పట్టారు. ఇదే సమయంలో తెలంగాణలో దసరా అతి పెద్ద పండగ. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉంటున్న వారు తమ సొంత జిల్లాలకు భారీ ఎత్తున బయలుదేరుతున్నారు. దీంతో వచ్చే మంగళ, బుధవారం నాటికి ఏపీతోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు రాజధాని నుంచి దాదాపు 10-15 లక్షల మంది వరకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులకే కాకుండా ప్రైవేటు బస్సులకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. సాధారణంగా రూ.500 ఉన్న టిక్కెట్‌ను ప్రైవేటు బస్సుల యజమానులు రూ.1500 చేశారు. శనివారం ఎంజీబీఎస్‌ జనంతో కిక్కిరిపోయింది. సికింద్రాబాద్‌, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో సాయంత్రం నుంచి ఇసుక వేస్తే రాలనంతగా జనం ఉంటున్నారు. పఠాన్‌చెరు, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లో రాత్రి 9 తర్వాత ఒక్కసారిగా వందల బస్సులు బయలుదేరుతున్నాయి. దీంతో కూకట్‌పల్లి నుంచి ఎల్బీనగర్‌ వరకు తీవ్ర ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది.  


           

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని