logo

దక్కని స్వచ్ఛ భాగ్యం

స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే-2022లో హైదరాబాద్‌కు నిరాశ ఎదురైంది.  కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ శనివారం విడుదల చేసిన ర్యాంకుల్లో.. పురస్కారం ఊసే లేదు.

Published : 02 Oct 2022 03:50 IST

పారిశుద్ధ్య సమస్యలతో నగరం 26వ ర్యాంకుకు పరిమితం

బోరబండ పర్వత్‌నగర్‌ వద్ద రహదారిపై చెత్త

ఈనాడు, హైదరాబాద్‌: స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే-2022లో హైదరాబాద్‌కు నిరాశ ఎదురైంది.  కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ శనివారం విడుదల చేసిన ర్యాంకుల్లో.. పురస్కారం ఊసే లేదు. పది లక్షలకు పైగా ఉన్న జనాభా ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ 26వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఎప్పటిలాగే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ మొదటి ర్యాంకు దక్కించుకోగా.. గుజరాత్‌లోని సూరత్‌కు రెండో ర్యాంకు, మహారాష్ట్రలోని నవీ ముంబయికి మూడో స్థానం దక్కింది. దేశంలోని చాలా చిన్న నగరాలు హైదరాబాద్‌ కన్నా మెరుగైన ర్యాంకు సాధించాయి.
క్షేత్రస్థాయిలో సత్తాచాటలేక..
ఎస్‌ఎస్‌-2022 సర్వేకు సంబంధించిన గణన ప్రక్రియ జులై 2021 నుంచి మార్చి 2022 మధ్య దేశవ్యాప్తంగా 4,384 నగరాల్లో జరిగింది. మూడు త్రైమాసికాల్లో వేర్వేరు అంశాలను కేంద్ర ప్రతినిధులు పరిశీలించారు. అందులో గార్బేజీ ఫ్రీ సిటీ(చెత్తకుప్పల్లేని నగరం) విభాగం కింద హైదరాబాద్‌ మార్కులను ఎక్కువగా కోల్పోయి త్రీస్టార్‌ రేటింగ్‌కు పరిమితమైంది. ఇంటింటి చెత్త సేకరణ సవ్యంగా లేకపోవడం, ప్రజా మరుగుదొడ్లలో అపరిశుభ్రత, నాలాల్లో చెత్త కుప్పలు కనిపించడం, పౌరుల నుంచి అందే ఫిర్యాదులను సవ్యంగా పరిష్కరించకపోవడం వంటి అంశాల్లోనూ వెనుకబడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని