logo

వందేళ్లు దాటి.. పాఠాలు నేర్పి

జాతీయ స్థాయి గుర్తింపు పొందడంలో నగరంలోని  రైల్వే స్టేషన్లు ఘనతకెక్కాయి. ఇటీవల పర్యావరణ అవార్డును హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌ సొంతం చేసుకోగా.. జాతీయ పర్యాటక అవార్డును సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అందుకుంది.

Published : 02 Oct 2022 03:50 IST

జాతీయ గుర్తింపు పొందిన నగర రైల్వేస్టేషన్లు

ఈనాడు - హైదరాబాద్‌:  జాతీయ స్థాయి గుర్తింపు పొందడంలో నగరంలోని  రైల్వే స్టేషన్లు ఘనతకెక్కాయి. ఇటీవల పర్యావరణ అవార్డును హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌ సొంతం చేసుకోగా.. జాతీయ పర్యాటక అవార్డును సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అందుకుంది.
పర్యాటకులకు అనువుగా..
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ 1874 నుంచి ప్రయాణికుల సేవలో నిమగ్నమైంది.  245 రైళ్ల రాకపోకలతో.. ప్రయాణికులకు అనువుగా ఈ స్టేషన్‌ సేవలందిస్తోంది. ఎస్కలేటర్లు, లిఫ్టులు, పాదచారుల వంతెనలు, పర్యాటక సమాచార కేంద్రాలు,  బ్యాటరీతో నడిచే కార్లు, విశ్రాంతి గదులు..ఇలా అనేక సేవలందిస్తూ.. ప్రయాణికుల మన్ననలు పొందుతోంది.  ఇక్కడ ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ.. స్వచ్ఛ కార్యక్రమాల్లో నేరుగా ద.మ. రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ పాల్గొని పర్యవేక్షిస్తున్నారు.
ఏడాదికి రూ. 7.78 లక్షల పొదుపు
నగరంలో అతి పురాతనమైన  హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌లో  87 శాతం రూఫ్‌ అంతా సోలార్‌ పలకలతో.. సూర్యరశ్మి నేరుగా భవనాన్ని తాకకుండా వేడి నియంత్రణ, స్టేషన్‌ అవసరాల్లో 34 శాతం సోలార్‌ విద్యుత్‌ వినియోగం, వినియోగించిన నీటిని మళ్లీ ఉపయోగించే విధంగా రోజూ 300 కేఎల్‌డీ సామర్థ్యంతో స్టేషన్‌ అవసరాల్లో 15.2శాతం నీటి అవసరాలు తీర్చుతోంది. ప్రతి ఏటా రూ.7.78 లక్షలను హైదరాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆదా చేస్తోంది. ప్రపంచ పర్యావరణ భవన వారోత్సవాల్లో ప్లాటినమ్‌ ధ్రువపత్రాన్ని పొందింది.  కాచిగూడ,  హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌, లింగంపల్లి రైల్వేస్టేషన్‌ ఇంధన పొదుపులో పలు అవార్డులను ఇటీవల సొంతం చేసుకున్నాయి.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని