logo

పెళ్లికి చేసిన అప్పు తీర్చేందుకు..

పెళ్లికి చేసిన అప్పు తీర్చేందుకు  పగటిపూట చోరీలు చేస్తున్న యువకుడిని మేడిపల్లి పోలీసులు రిమాండ్‌ చేశారు. శనివారం మేడిపల్లి ఠాణాలో  మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి, ఏసీపీ నరేష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా గొండ్యాలకు

Published : 02 Oct 2022 03:50 IST

యువకుడి చోరీల బాట

 రూ.8 లక్షల సొత్తు స్వాధీనం

ఆభరణాలను చూపుతున్న మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి

మేడిపల్లి(బోడుప్పల్‌): పెళ్లికి చేసిన అప్పు తీర్చేందుకు  పగటిపూట చోరీలు చేస్తున్న యువకుడిని మేడిపల్లి పోలీసులు రిమాండ్‌ చేశారు. శనివారం మేడిపల్లి ఠాణాలో  మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి, ఏసీపీ నరేష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా గొండ్యాలకు చెందిన మహ్మద్‌ సుభాన్‌(25) పీర్జాదిగూడ రామకృష్ణానగర్‌లోని మసీదు ప్రాంతంలో ఉంటున్నాడు.  గతంలో చోరీలు చేసి బాలనేరస్థుడిగా జీవితం గడిపాడు. ప్రస్తుతం ఫుడ్‌డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.  తన పెళ్లికి చేసిన రూ.3 లక్షల అప్పు తీర్చేందుకు చోరీల బాట పట్టాడు. మేడిపల్లి ఠాణా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. శుక్రవారం బోడుప్పల్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని విచారించారు. అతని నుంచి రూ.8లక్షల విలువైన 13.5 తులాల బంగారు, 58 తులాల వెండి నగలు, రూ.35వేల నగదు, ద్విచక్రవాహనం, చరవాణి స్వాధీనం చేసుకున్నారు.   సీఐ గోవర్దనగిరి, డీఐ ప్రవీణ్‌బాబు, డీఎస్సై లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని