logo

భవితకు అందని భత్యం!

ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే ఉద్దేశంతో సమగ్ర శిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో జిల్లాలో 27 భవిత కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో 1,408 మంది చిన్నారులు నమోదయ్యారు. 

Published : 02 Oct 2022 04:13 IST

న్యూస్‌టుడే, వికారాబాద్‌టౌన్‌

కేంద్రంలో చిన్నారులు

ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే ఉద్దేశంతో సమగ్ర శిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో జిల్లాలో 27 భవిత కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో 1,408 మంది చిన్నారులు నమోదయ్యారు.  బుద్ధిమాంద్యం, దృష్టి, వినికిడి లోపం, పుట్టుకతో అంగవైకల్యం ఉన్న పిల్లలను నమోదు చేసుకుని వారికి అక్షరాలు నేర్పడం, బొమ్మల గుర్తింపు, ఆటలు ఆడించడం వంటివి చేయిస్తారు. మధ్యాహ్న భోజనం కూడా అందిస్తారు. నరాలు, ఎముకల బలహీనత ఉన్నవారికి ప్రతి బుధవారం ఫిజియోథెరపీ చేస్తారు. కేంద్రాలకు రాని వారికి ప్రతి శనివారం ఇంటి వద్దే శిక్షణ ఇస్తున్నారు. కేంద్రంలో చేరిన వారికి ప్రతి నెలా ఒక్కొక్కరికీ రవాణా భత్యం కింద  రూ.350 చొప్పున ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేస్తోంది. అయితే ఈ బిల్లులు ఏడాదిగా రావడం లేదు. ఈ విషయంలో ఉన్నతాధికారులు దృష్టి సారించి ఇచ్చేలా చూడాలని కోరుతున్నారు. అంతేకాకుండా   వినికిడిలోపం మాటలు రాని చిన్నారుల్లో పురోగతికి స్పీచ్‌ థెరపిస్టులను నియమించాలని కోరుతున్నారు. ఈ విషయమై సెక్టోరియల్‌ అధికారి రవీందర్‌ మాట్లాడుతూ.. బకాయిలు త్వరలోనే జమకానున్నాయని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని