logo

దళారులు చెప్పిందే ధర..!

హోల్‌సేల్‌ మార్కెట్లలో ఉండాల్సిన దళారులు ఇప్పుడు నేరుగా కూరగాయల పొలాలకే వెళ్తున్నారు. పండిన పంటకు గిరాకీ లేదంటూ తక్కువ ధరకు రైతుల నుంచి కొనేస్తున్నారు. నగరంలోని హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్లకు, సంతలకు సరఫరా చేస్తున్నారు.

Published : 04 Oct 2022 03:04 IST

గిరాకీ లేదంటూ.. రైతుల వద్దకే వెళ్లి కొనుగోలు..

అధిక ధరలకు వినియోగదారులకు విక్రయం

ఈనాడు, హైదరాబాద్‌: హోల్‌సేల్‌ మార్కెట్లలో ఉండాల్సిన దళారులు ఇప్పుడు నేరుగా కూరగాయల పొలాలకే వెళ్తున్నారు. పండిన పంటకు గిరాకీ లేదంటూ తక్కువ ధరకు రైతుల నుంచి కొనేస్తున్నారు. నగరంలోని హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్లకు, సంతలకు సరఫరా చేస్తున్నారు. చెప్పినధరకే అమ్మేలా మిగతా వారితో రింగు అవుతున్నారు. ఈ కూరగాయలనే రిటైల్‌ వ్యాపారులు కొని.. రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. తమకు కూరగాయలు తీసుకొచ్చే వారు తమ వద్ద ఎక్కువే తీసుకుంటున్నారని.. తదనుగుణంగా అమ్మాల్సి వస్తోందని ఓ దుకాణదారులు అన్నారు. వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ నిర్లక్ష్యంతో అటు రైతులు ఇటు ప్రజలు నష్టపోతున్నారు.

సరైన రవాణా వ్యవస్థ లేకనే..

రైతుబజార్లను అనుసంధానం చేస్తూ కూరగాయలు తెచ్చేందుకు ఆర్టీసీ బస్సులు నడుస్తుండేవి. ప్రస్తుతం అవి చాలా వరకు రద్దయ్యాయి. దళారులు ఆటోట్రాలీలు, మినీ ట్రక్కులతో నేరుగా పంటపొలాలకు వెళ్లి కూరగాయలు తీసుకువస్తున్నారు. పండిన పంటను అమ్ముకోడానికి వెళ్తే పంటపొలంలో ఎవరుంటారు అనే రైతుల ఆలోచన.. దళారులకు అనువుగా మారిందని గుడిమల్కాపూర్‌ కమీషన్‌ ఏజెంట్‌ మాణిక్‌ ప్రభు చెప్పారు. నగరంలోని రిటైల్‌ వ్యాపారులు కూడా దళారులనే నమ్ముకుని నేరుగా కూరగాయలు తెచ్చుకుంటున్నారు.

నగరంలో నిత్యం అవసరమైన కూరగాయలు 35 వేల క్వింటాళ్లు

వస్తున్నవి 29 వేల క్వింటాళ్లు

వ్యత్యాసం: 6 వేల క్వింటాళ్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని