logo

వంతెనలున్నా.. అంతేనా

నగరంలో మూసీపై నిర్మించిన వంతెనల పై అప్పుడప్పుడు వరద ఆగుతుండగా, భారీ వర్షాలు కురిసినప్పుడు ఏకంగా ప్రవహిస్తోంది. రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. నగరంలో వర్షం పడిన ప్రతిసారీ ఇవే అవస్థలు.

Published : 04 Oct 2022 03:04 IST

వాన పడితే అంబర్‌పేట, అత్తాపూర్‌ బ్రిడ్జిలపై వరద

కిందనే మూసీ.. అయినా తప్పని తిప్పలు

ఇటీవల అంబర్‌పేట వంతెనపై వరద

ఈనాడు, హైదరాబాద్‌ : నగరంలో మూసీపై నిర్మించిన వంతెనల పై అప్పుడప్పుడు వరద ఆగుతుండగా, భారీ వర్షాలు కురిసినప్పుడు ఏకంగా ప్రవహిస్తోంది. రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. నగరంలో వర్షం పడిన ప్రతిసారీ ఇవే అవస్థలు.

నగరంలో మూసీపై పలుచోట్ల వంతెనలున్నాయి. కాస్త పెద్ద వర్షం పడినా వరద వంతెనలను ముంచెత్తుతోంది. అంబర్‌పేట వంతెన వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. దిగువున డ్రెయిన్ల నుంచి నీరు సరిగా ప్రవహించక బ్రిడ్జి నిండిపోతోంది. అత్తాపూర్‌ బ్రిడ్జిపైనా ఇదే పరిస్థితి. అయినా జీహెచ్‌ఎంసీ పట్టించుకోవడం లేదు. వచ్చే వర్షాకాలం నాటికైనా డ్రెయిన్ల వద్ద వ్యర్థాలు తొలగించడం, నీటి ప్రవాహ సామర్థ్యం పెంచడం వంటి చర్యలు చేపడితేనే సమస్యలు పరిష్కారమయ్యేది.

 ఫ్లైఓవర్ల వద్ద..  

నగరంలో పదుల సంఖ్యలో పైవంతెనలు నిర్మించారు. కొన్నింటి ప్రారంభం, ముగింపు వద్ద వరద తిష్ఠ వేస్తోంది. నిర్మాణం వరకే తమ బాధ్యత అన్నట్లుగా గుత్తేదారులు, పర్యవేక్షక ఇంజినీర్లు వ్యవహరిస్తున్నారు. సరైన ప్లానింగ్‌ లేక, ఇంజినీరింగ్‌ లోపాలతో ఎక్కేచోట, దిగేచోట చెరువులను తలపిస్తున్నాయి. ఇటీవల పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే మార్గంలో లక్ష్మీనగర్‌ వద్ద కొత్తగా ర్యాంప్‌ నిర్మాణం చేపట్టారు. దిగేచోట పైనుంచి వచ్చేనీరు మార్గం లేక పెద్ద మడుగులా మారుతోంది. ఇక్కడ రెండోవైపు ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు నిర్మించిన ర్యాంప్‌ వద్ద పరిస్థితి అధ్వానంగా తయారవుతోంది.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts