logo

వాహనదారులూ సంయమనం పాటించండి: సీవీ ఆనంద్‌

బెంగళూరులో ఉన్న ట్రాఫిక్‌ సమస్య నగరంలో రావొద్దనే ఆలోచనతో ముందస్తు నిర్ణయాలు తీసుకుంటున్నామని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి వాహనదారులు స్వచ్ఛందంగా పోలీసులకు సహకరించాలని నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ కోరారు.

Published : 04 Oct 2022 03:04 IST

జూబ్లీహిల్స్‌లో సూచనలిస్తున్న సీవీ ఆనంద్‌,

చిత్రంలో ఏవీ రంగనాథ్‌, రంగారావు, జ్ఞానేందర్‌రెడ్డి

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: బెంగళూరులో ఉన్న ట్రాఫిక్‌ సమస్య నగరంలో రావొద్దనే ఆలోచనతో ముందస్తు నిర్ణయాలు తీసుకుంటున్నామని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి వాహనదారులు స్వచ్ఛందంగా పోలీసులకు సహకరించాలని నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ కోరారు. ‘రోప్‌ ఆపరేషన్‌’లో భాగంగా తొలుత వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ప్రాధాన్యమిస్తామన్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 45 కూడలిలో ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన ‘ఫ్రీ లఫె్ట్‌’ రోప్‌ విధానాన్ని ఆయన సంయుక్త కమిషనర్‌ (ట్రాఫిక్‌) ఏవీ రంగనాథ్‌, ఉత్తర మండల అదనపు ట్రాఫిక్‌ డీసీపీ రంగారావు, పంజాగుట్ట ట్రాఫిక్‌ ఏసీపీ జ్ఞానేందర్‌రెడ్డితో కలిసి సోమవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 45 కూడలి ఇరుకుదారి అయినా ప్రయోగాత్మకంగా రెండు, మూడు రోజులు పరిశీలిస్తామని, వాహనదారులు సంయమనం పాటించాలని కోరారు. ప్రజాప్రతినిధులు సైతం ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని, ఎలాంటి ఒత్తిడి తీసుకురాకుండా ముందుకు వెళ్లాలని కోరారు. రోప్‌ ఆపరేషన్‌లో భాగంగా మొదటి రోజు 25 ట్రాఫిక్‌ యూనిట్లు పలు ప్రాంతాల్లో దృష్టి సారించామని, 472 మంది వాహనదారులు, 18 వాణిజ్య సముదాయాలు నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో రూ.3,65,000 చలానా విధించినట్లు వివరించారు. కొన్నిచోట్ల తెల్లగీత దాటకూడదంటూ ఫ్లెక్సీలతో అవగాహన కల్పించారు. ఒక్కసారిగా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టడంతో నిబంధనలు అతిక్రమించిన కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

రద్దు మాట.. దోపిడీ బాట

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: దసరా నేపథ్యంలో కొంతమంది ప్రైవేటు బస్సుల యజమానులు సరికొత్త రీతిలో ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారు. సాంకేతిక కారణంతో సర్వీసు రద్దయ్యిందంటూ నెల కిందట బుక్‌ చేసిన ప్రయాణికులకు సందేశాలు పంపుతున్నారు. అదే బస్సులకు కొత్త సర్వీస్‌ నంబరుతో టికెట్లు విక్రయిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ రావాలనుకున్న శ్రీగుణ అనే ప్రైవేటు ఉద్యోగికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో రెండింతలు చెల్లించి మళ్లీ టికెట్‌ బుక్‌ చేసుకోవాల్సి వచ్చింది.

27 వాహనాలు సీజ్‌.. రూ.3.77లక్షల జరిమానా

ఈనాడు, హైదరాబాద్‌: నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు వాహనాలపై రవాణా శాఖ అధికారులు చర్యలు మొదలు పెట్టారు. పదిరోజుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి 27వాహనాలపై కేసులు నమోదు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు జేటీసీ పాండురంగనాయక్‌ సోమవారం తెలిపారు. జరిమానాల ద్వారా రూ.3.77లక్షలు వసూలు చేశామని వివరించారు. కర్నూలు, విజయవాడ మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని గ్రహించిన రవాణాశాఖ అధికారులు ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ వద్ద తనిఖీలు చేపట్టారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని