logo

ఎక్స్‌ఆర్‌ సాంకేతికత అంకురాలకు అండ

మెటావర్స్‌, ఎక్స్‌ఆర్‌(ఎక్సెటెండెడ్‌ రియాలిటీ) సాంకేతికతలను ప్రోత్సహించేందుకు నగరంలోని ట్రిపుల్‌ఐటీ ముందుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఎక్స్‌ఆర్‌ అంకుర సంస్థలకు సాంకేతిక సహకారం అందించాలని నిర్ణయించింది.

Published : 04 Oct 2022 03:04 IST

భాగస్వామిగా వ్యవహరించనున్న ట్రిపుల్‌ఐటీ

ఈనాడు, హైదరాబాద్‌: మెటావర్స్‌, ఎక్స్‌ఆర్‌(ఎక్సెటెండెడ్‌ రియాలిటీ) సాంకేతికతలను ప్రోత్సహించేందుకు నగరంలోని ట్రిపుల్‌ఐటీ ముందుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఎక్స్‌ఆర్‌ అంకుర సంస్థలకు సాంకేతిక సహకారం అందించాలని నిర్ణయించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక శాఖ(మైటీ) ఆధ్వర్యంలో మైటీ స్టార్టప్‌ హబ్‌ నడుస్తోంది. దీని తరఫున దేశవ్యాప్తంగా ఎక్స్‌ఆర్‌తోపాటు ఏఆర్‌(అగుమెంటెడ్‌ రియాలిటీ), వీఆర్‌(వర్చువల్‌ రియాలిటీ) సాంకేతికతల ఆధారంగా ఏర్పడే అంకుర సంస్థలకు ప్రోత్సాహం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. దీన్ని అమలుచేసే భాగస్వామిగా ట్రిపుల్‌ఐటీలోని సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంట్రపెన్యూర్‌షిప్‌(సీఐఈ)ని ఎంచుకుంది. దీంతోపాటు సిక్కింలోని ఎస్‌ఎంయూ టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేషన్‌ ఫౌండేషన్‌ అటల్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రం, గుజరాత్‌ యూనివర్సిటీ స్టార్టప్‌, ఎంట్రపెన్యూర్‌షిప్‌ కౌన్సిల్‌, న్యూదిల్లీలోని ఇన్నోవేషన్‌, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ ఫౌండేషన్‌ భాగస్వాములు కానున్నాయి.

తొలిదశలో 40

తొలుత యాగ్జర్లేటర్‌ కార్యక్రమంలో భాగంగా ఎక్స్‌ఆర్‌ సాంకేతికతపై పనిచేస్తున్న 40 తొలిదశ అంకుర సంస్థలకు రూ.20లక్షలు చొప్పున మైటీ శాఖ కేటాయిస్తుంది. గ్రాండ్‌ ఛాలెంజ్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ప్రాథమిక దశలోని ఆవిష్కర్తలకు ప్రోత్సాహం లభించనుంది. వీరికి పరిశోధన దశ నుంచి ఉత్పత్తుల స్థాయి వరకు సహకారం అందిస్తారు. 80 ఆవిష్కర్తలను ఆహ్వానించి 16 ఆవిష్కర్తలకు రూ.20లక్షల చొప్పున గ్రాంటు ఇవ్వనునున్నారు. ట్రిపుల్‌ఐటీ తరఫున గేమింగ్‌, ఎంటర్‌టెయిన్‌మెంట్‌ విభాగంలోని సహకారం అందించనున్నట్లు ట్రిపుల్‌ఐటీ సీఐఈ డీప్‌టెక్‌, మెడ్‌టెక్‌ ఇంక్యుబేటర్‌ అధిపతి అనుభవ్‌ తివారి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని