logo

నియంత్రిక.. ప్రమాదాల కేక

గ్రేటర్‌లో నియంత్రికల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పాత వాటిలో తలెత్తుతున్న సమస్యలతో తరచూ విద్యుత్తు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. చాలాచోట్ల లైటనింగ్‌ అరెస్టర్లు పనిచేయడం లేదని సిబ్బంది చెబుతున్నారు.

Published : 04 Oct 2022 03:04 IST

ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద విద్యుత్తు శాఖ నిర్లక్ష్యం

బేగంబజార్‌లో నియంత్రిక వద్ద చెత్త

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో నియంత్రికల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పాత వాటిలో తలెత్తుతున్న సమస్యలతో తరచూ విద్యుత్తు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. చాలాచోట్ల లైటనింగ్‌ అరెస్టర్లు పనిచేయడం లేదని సిబ్బంది చెబుతున్నారు. నిర్వహణ లేక డీటీఆర్‌ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. చాలాచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు చెత్త డంపింగ్‌ కేంద్రాలుగా మారాయి. నిప్పు అంటుకుని మంటలతో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మెట్రోజోన్‌ పరిధిలో ఆరేళ్ల క్రితం వెయ్యి నియంత్రికల చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ ఖర్చును ప్రైవేటు సంస్థ భరించింది. ప్రతిగా ప్రకటనల బోర్డు ద్వారా వచ్చే ఆదాయం తీసుకుంటామని డిస్కంతో ఒప్పందం చేసుకుంది. ఇది సత్ఫలితాలిచ్చినా.. ఎక్కువ కాలం సాగలేదు. ఆ తర్వాత విద్యుత్తు సెక్షన్ల వారీగా ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ శుభ్రం చేసేందుకు చర్యలు మొదలెట్టారు.దీన్నీ కొనసాగించలేకపోయారు.

నిర్వహణ లోపం..

నియంత్రికల నిర్వహణ సక్రమంగా ఉంటే చాలా వరకు అంతరాయాలకు చెక్‌పెట్టొచ్చని విద్యుత్తు నిపుణులు పేర్కొంటున్నారు. కానీ ఈ పని సక్రమంగా జరగడం లేదు. శివార్లలో వర్షాకాలంలో ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద తరచూ పశువులు మృత్యువాత పడుతున్నాయి. 33కేవీ లైన్ల పర్యవేక్షణ ఏడీఈ, 11కేవీ లైన్ల పర్యవేక్షణ ఏఈ, ఎల్‌టీ లైన్ల నిర్వహణ సిబ్బంది చేయాలి. వానాకాలంలో పిడుగుల నుంచి రక్షణ కోసం ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద లైటనింగ్‌ అరెస్టర్లు అమర్చుతారు. పాత డీటీఆర్‌ల వద్ద ఇవి పనిచేయడం లేదని తెలిసినా డిస్కం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని