logo

ఇష్టం లేకున్నా యువత రాజకీయాలు తెలుసుకోవాలి: శశిథరూర్‌

రాజకీయ నేతలు, పాలకులు తీసుకునే నిర్ణయాలు యువతపై ప్రభావం చూపుతాయని ఈ క్రమంలో ఇష్టం లేకపోయినా రాజకీయాలు తెలుసుకునేందుకు యువత ఆసక్తి చూపాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డా.శశిథరూర్‌ పేర్కొన్నారు.

Published : 04 Oct 2022 03:04 IST

జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న డా.శశిథరూర్‌

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: రాజకీయ నేతలు, పాలకులు తీసుకునే నిర్ణయాలు యువతపై ప్రభావం చూపుతాయని ఈ క్రమంలో ఇష్టం లేకపోయినా రాజకీయాలు తెలుసుకునేందుకు యువత ఆసక్తి చూపాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డా.శశిథరూర్‌ పేర్కొన్నారు. సోమవారం సోమాజిగూడలోని ది పార్కు హోటల్‌లో ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఫీక్కి ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖీలో ఆయన పాల్గొన్నారు. మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. తాను రాజకీయాల్లోకి వచ్చినపుడు ఎలాంటి సంసిద్ధత లేదని, తాను ఏది మాట్లాడినా వ్యంగ్యంగా తీసుకోవడంతో ఆందోళనకు గురిచేసిందని, న్యాయవాదుల ద్వారా నోటీసులు పంపించాలని భావించినా నట్వర్‌సింగ్‌ సూచనలతో అలాంటివి పట్టించుకోవడం మానేశానన్నారు. అధికారంలో ఉన్న వారిని వ్యాపారవేత్తలు ప్రశ్నిస్తే.. పన్ను వసూలు శాఖలతో దాడులు చేయించడం, వ్యాపారాలపై కఠిన చట్టాలు తేవడం సాధారణంగా మారిందని, అందుకే ఎవ్వరూ ప్రశ్నించడంలేదన్నారు. ఈ విషయంలో అధికార దుర్వినియోగం జరుగుతున్నా వ్యాపారవేత్తలు, చదువుకున్న వారు ప్రశ్నించాలని సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో మహిళా బోర్డు డైరెక్టరు ఉండాలని, ఈ విషయాన్ని తాను పార్లమెంటులో లేవనెత్తినా స్పందన కరవైందని అన్నారు. ఒక్కో ప్రసంగానికి 50 వేల యూఎస్‌ డాలర్లు పొందే వాడినని, డబ్బు ముఖ్యం కాదని, తన వల్ల కొందరు మారినా సంతోషమని పేర్కొన్నారు. సీనియర్‌ పాత్రికేయులు కర్రీ శ్రీరాం అనుసంధాన కర్తగా వ్యవహరించగా ఫిక్కీ ఛైర్‌ పర్సన్‌ శుభ్రా మహేశ్వరి అధ్యక్షత వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని