logo

విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించే యత్నాన్ని అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర పవర్‌ ఇంజినీర్స్‌ ఐకాస పేర్కొంది. పుదుచ్చేరి విద్యుత్తు శాఖ డిస్టిబ్య్రూషన్‌ వ్యవస్థను ప్రైవేట్‌ పరం చేసేందుకు టెండర్లు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, యూపీ రాష్ట్రాల నుంచి పలువురు ఉద్యోగ సంఘాల నేతలు తరలివెళ్లారు.

Published : 04 Oct 2022 03:04 IST

ఎస్పీడీసీఎల్‌ ఎదుట ఉద్యోగుల నిరసన

ప్లకార్డులు ప్రదర్శిస్తున్న విద్యుత్తు అధికారులు, సిబ్బంది

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించే యత్నాన్ని అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర పవర్‌ ఇంజినీర్స్‌ ఐకాస పేర్కొంది. పుదుచ్చేరి విద్యుత్తు శాఖ డిస్టిబ్య్రూషన్‌ వ్యవస్థను ప్రైవేట్‌ పరం చేసేందుకు టెండర్లు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, యూపీ రాష్ట్రాల నుంచి పలువురు ఉద్యోగ సంఘాల నేతలు తరలివెళ్లారు. అక్కడి ఉద్యోగులకు సంఘీభావంగా సోమవారం మింట్‌కాంపౌండ్‌లోని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ కార్యాలయం ఎదుట ఇంజినీర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఐకాస ప్రధాన కార్యదర్శి పి.సదానందం మాట్లాడుతూ.. విద్యుత్‌ సవరణ బిల్లు-2022 విషయంలో వెనక్కు తగ్గకపోతే దేశ వ్యాప్తంగా ఉన్న 20 లక్షల మంది విద్యుత్తు ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగుతారని హెచ్చరించారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts