logo

చెవుల్లోకి భారీ శబ్దం

బస్సులు, కార్ల హారన్లు.. దడ్‌దడ్‌మంటూ బుల్లెట్ల శబ్దాలు.. రయ్యిమంటూ బైకుల విన్యాసాలు. ఇవి పగలు మాత్రమే కాదు.. రాత్రుళ్లు కనిపిస్తున్నాయి.. విన్నిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెవులు దిబ్బెళ్లు పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో పరిమితికి మించి శబ్దం ఉత్పన్నమవుతోంది..

Updated : 04 Oct 2022 05:06 IST

పగలూ, రాత్రీ హారన్ల మోత

ఈనాడు, హైదరాబాద్‌: బస్సులు, కార్ల హారన్లు.. దడ్‌దడ్‌మంటూ బుల్లెట్ల శబ్దాలు.. రయ్యిమంటూ బైకుల విన్యాసాలు. ఇవి పగలు మాత్రమే కాదు.. రాత్రుళ్లు కనిపిస్తున్నాయి.. విన్నిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెవులు దిబ్బెళ్లు పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో పరిమితికి మించి శబ్దం ఉత్పన్నమవుతోంది.. దేశ రాజధాని దిల్లీ సహా మెట్రో నగరాల్లో ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్య ఇది. శబ్దకాలుష్యం పెరగకుండా నియంత్రణలు చేపట్టాలంటూ కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్ర మండళ్లు ప్రభుత్వాలకు కొద్దిరోజుల క్రితం నివేదించాయి. రోజురోజుకు వాహనాలు పెరుగుతున్న నేపథ్యంలో శబ్దకాలుష్యానికి అడ్డుకట్ట వేయాలంటూ పీసీబీ పలు సూచనలు చేస్తోంది. మెట్రో నగరాల్లో ప్రతి నగరంలో పదిచోట్ల ప్రత్యేక శబ్ద పరిమితుల లెక్కింపు యంత్రాలను పీసీబీ ఏర్పాటు చేసింది.

నివాస ప్రాంతాలు.. నిబంధనలు బేఖాతరు

* మెట్రో నగరాల్లో పారిశ్రామిక, సున్నిత ప్రాంతాల్లో కంటే నివాస ప్రాంతాల్లోనే ఎక్కువగా శబ్దకాలుష్యం ఉత్పన్నమవుతోందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తన నివేదికలో పేర్కొంది.

* బైకులు, కార్ల యజమానులు భారీ శబ్దాలు చేసుకుంటూ రాకపోకలు సాగిస్తున్నందుకే శబ్దకాలుష్యం పెరుగుతోంది. చెన్నైలోని టీ నగర్‌, హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌, బెంగళూరులో నిసర్గ భవన్‌, ముంబయిలో చెంబూర్‌, దిల్లీ ఆర్కేపురంలో అధికంగా శబ్దకాలుష్యం నమోదవుతోంది.

* మెట్రో నగరాల్లోని గల్లీలు, అనుసంధాన రహదారులపై రాత్రుళ్లు వాహనాలపై యువకులు చేస్తున్న విన్యాసాల వల్ల వెలువడే శబ్దాలను చాలామంది నివాసితులు భరించలేక పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. రాత్రి 8-10 గంటల మధ్య విధుల నుంచి ఇళ్లకు చేరుకొనేవారి సంఖ్య ఎక్కువగా ఉండడమూ కాలుష్య పెరుగుదలకు కారణమవుతోంది.

* హైదరాబాద్‌, ముంబయి నగరాల్లోని పలు ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి దాటేంత వరకూ శబ్దాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సమయాల్లో యువకులు వాహనాలపై మితిమీరిన వేగంతో వెళ్లడమే దీనికి కారణం.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts