logo

ప్రజలకు అందుబాటులో పాలన

ప్రజలకు పాలన చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం దుద్యాల మండలకేంద్రంలో నూతనంగా తహసీల్దారు, ఎంఈవో కార్యాలయాలను ఆమె ప్రారంభించారు.

Published : 04 Oct 2022 03:03 IST

దుద్యాల కార్యాలయాల ప్రారంభంలో మంత్రి సబితారెడ్డి

తహసీల్‌ కార్యాలయంలో మంత్రి సబితారెడ్డి, మహబూబ్‌నగర్‌

ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డి,

ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, కలెక్టర్‌ నిఖిల, తదితరులు

బొంరాస్‌పేట, న్యూస్‌టుడే: ప్రజలకు పాలన చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం దుద్యాల మండలకేంద్రంలో నూతనంగా తహసీల్దారు, ఎంఈవో కార్యాలయాలను ఆమె ప్రారంభించారు. ముందుగా కొత్త మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో దుద్యాలలో భారీగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. కొత్తగా పంచాయతీలు, మండలాలు, రెవెన్యూ కార్యాలయాలు పెంచటంతో ప్రజలకు ఉన్నతాధికారులు అందుబాటులోకి రావటంతో సమస్యలు సత్వరం పరిష్కారమవుతున్నట్లు చెప్పారు. దసరా కానుకగా ఎమ్మెల్యే మీకు కొత్త మండలాన్ని అందించటంతో మీరంతా ఆయనకు అండగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు సునీతామహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు విజయ్‌కుమార్‌, కలెక్టర్‌ నిఖిల, డీఈవో రేణుకాదేవి, ఎంపీపీ హేమీబాయి, జడ్పీటీసీ సభ్యురాలు అరుణాదేశు తదితరులున్నారు.

ప్రకృతి ఆరాధనే బతుకమ్మ

వికారాబాద్‌: ప్రకృతిని ఆరాధించే విధానమే బతుకమ్మ పండుగని మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో డీఆర్‌డీఏ, ఐసీడీఎస్‌, పురపాలక సంఘం, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. బతుకమ్మను పూలతో అలంకరించి ఏరోజు కారోజు నీటిలో నిమజ్జనం చేస్తారని, గరిక, పూలు, ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలు నీటిలో కలిసి ఆవిరిగా మారడం వల్ల మానవాళికి మేలు జరుగుతోందన్నారు. ఉత్తమ బతుకమ్మను పేర్చిన డీఆర్‌డీఏ శాఖకు ప్రథమ బహుమతి రూ.10 వేలు, ఐసీడీఎస్‌కు ద్వితీయ బహుమతి రూ.5 వేలు అందించారు. జిల్లాలోని 114 మంది మూత్రపిండాల వ్యాధిగ్రస్థులకు పింఛను మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. వికారాబాద్‌, పరిగి ఎమ్మెల్యేలు ఆనంద్‌, మహేష్‌రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్‌, జిల్లా కలెక్టర్‌ నిఖిల, పురపాలక సంఘం అధ్యక్షురాలు మంజుల, పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని