logo

రామానంద తీర్థ పోరాటాన్ని భావితరాలకు తెలియజేయాలి

ప్రజా సేవనే మాధవ సేవగా భావించిన వ్యక్తి స్వామి రామానంద తీర్థ అని రాజ్యసభ సభ్యులు కేశవరావు(కేకే) అన్నారు. స్వామి రామానంద తీర్థ 119వ జయంతిని సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్సీ సురభి వాణీదేవి రాసిన ‘హైదరాబాద్‌ సంస్థాన స్వాతంత్య్ర సమరయోధుడు’ పుస్తకాన్ని కేకే ఆవిష్కరించారు.

Published : 04 Oct 2022 03:03 IST

పుస్తకంతో కేకే, వాణీదేవి, గౌరీశంకర్‌, పీవీ ప్రభాకర్‌రావు, శేఖర్‌ మారంరాజు

బేగంపేట, న్యూస్‌టుడే: ప్రజా సేవనే మాధవ సేవగా భావించిన వ్యక్తి స్వామి రామానంద తీర్థ అని రాజ్యసభ సభ్యులు కేశవరావు(కేకే) అన్నారు. స్వామి రామానంద తీర్థ 119వ జయంతిని సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్సీ సురభి వాణీదేవి రాసిన ‘హైదరాబాద్‌ సంస్థాన స్వాతంత్య్ర సమరయోధుడు’ పుస్తకాన్ని కేకే ఆవిష్కరించారు. కార్యక్రమం స్వామి రామానంద తీర్థ స్మారక కేంద్రం ఆవరణలో స్వామి రామానంద తీర్థ పరిశోధన సంస్థ తెలంగాణ రీజియన్‌, సురభి ఎడ్యుకేషనల్‌ సొసైటీ, సిరివాణి ట్రస్ట్‌, పీవీ గ్లోబల్‌ ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో జరిగింది. కేశవరావు మాట్లాడుతూ.. సమాజ అవసరం, ప్రజల అవసరాన్ని తెలుసుకుని స్వామి రామానంద తీర్థ పోరాటం సాగించారన్నారు. ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, జూలూరి గౌరీశంకర్‌, పీవీ నరసింహారావు తనయులు పీవీ ప్రభాకర్‌రావు, సంస్థ సభ్యులు వై.వి.చంద్రశేఖర్‌రావు, సోలార్‌ ఎనర్జీ శిక్షణ కేంద్రం డైరెక్టర్‌ శేఖర్‌ మారంరాజు, అరుణశ్రీ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts