logo

కూడళ్లు.. సొగసుల లోగిళ్లు

గ్రేటర్‌లో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే కూడళ్లు 350 కిపైగా ఉండగా, వాటిలో 114 చోట్ల అత్యాధునికంగా అభివృద్ధి చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సోమవారం తెలిపారు. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో రహదారులను ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు ప్రారంభించామని చెప్పారు.

Published : 04 Oct 2022 03:03 IST

114 చోట్ల అభివృద్ధి: మేయర్‌

ఇటీవల మెరుగులద్దిన ఉప్పల్‌ కూడలి

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే కూడళ్లు 350 కిపైగా ఉండగా, వాటిలో 114 చోట్ల అత్యాధునికంగా అభివృద్ధి చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సోమవారం తెలిపారు. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో రహదారులను ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు ప్రారంభించామని చెప్పారు. ట్రాఫిక్‌ సమస్యను నియంత్రిస్తూ, రహదారుల స్థాయిని పెంచే పనులను వేర్వేరు దశల్లో పూర్తి చేయనున్నట్లు వివరించారు. బెంగళూరుకు చెందిన జనాగ్రహ స్వచ్ఛంద సంస్థతో కలిసి జీహెచ్‌ఎంసీ ఇప్పటికే 12 కూడళ్లను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే పనులను ప్రారంభించింది. తాజాగా మరో 48ని ఇంజినీరింగ్‌ విభాగం జాబితాలో చేర్చి, సంఖ్యను 60కి పెంచింది.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts