logo

తీగల వంతెనకు కొత్తందాలు!

దుర్గం చెరువు వద్ద తీగల వంతెన కొత్త అందాలను సంతరించుకోనుంది. నగర పర్యటనకు వచ్చే సందర్శకులు చార్మినార్‌, బిర్లా టెంపుల్‌, హుస్సేన్‌సాగర్‌, గోల్కొండతోపాటు తీగల వంతెన చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. సినిమా షూటింగ్‌లకు ఇదో ప్రత్యేక ప్రాంతంగా మారింది.

Published : 04 Oct 2022 03:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: దుర్గం చెరువు వద్ద తీగల వంతెన కొత్త అందాలను సంతరించుకోనుంది. నగర పర్యటనకు వచ్చే సందర్శకులు చార్మినార్‌, బిర్లా టెంపుల్‌, హుస్సేన్‌సాగర్‌, గోల్కొండతోపాటు తీగల వంతెన చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. సినిమా షూటింగ్‌లకు ఇదో ప్రత్యేక ప్రాంతంగా మారింది. ప్రభుత్వానికి ఫీజుల రూపంలో ఆదాయం సమకూరుతోంది. పర్యాటకులను మరింత ఆకట్టుకునే విధంగా ఈ వంతెన చుట్టూ కొత్త అందాలతో ముస్తాబు చేయాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. వంతెనకు రెండువైపులా దుర్గం చెరువులో రూ.8.03 కోట్లతో మ్యూజికల్‌ ఫౌంటెయిన్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని