logo

వేర్వేరు ప్రాంతాల్లో కార్లు దగ్ధం

జాతీయ రహదారిపై వెళ్తున్న కారులోంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కూకట్‌పల్లి పరిధిలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. దమ్మాయిగూడకు చెందిన ప్రవీత్‌ ఇటీవల టాటా హరియర్‌ వాహనాన్ని కొనుగోలు చేశారు.

Published : 04 Oct 2022 03:03 IST

కూకట్‌పల్లిలో మంటల్లో కాలిపోతున్న కారు

మూసాపేట, మనోహరాబాద్‌: జాతీయ రహదారిపై వెళ్తున్న కారులోంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కూకట్‌పల్లి పరిధిలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. దమ్మాయిగూడకు చెందిన ప్రవీత్‌ ఇటీవల టాటా హరియర్‌ వాహనాన్ని కొనుగోలు చేశారు. ఆ కారులో ప్రవీత్‌ సోమవారం సాయంత్రం కేపీహెచ్‌బీకాలనీకి బయలుదేరాడు. రాత్రి 8.30 గంటల సమయంలో డీమార్టు వద్దకు రాగానే కారులో మంటలు వచ్చాయి. దీంతో ప్రవీత్‌ వెంటనే కిందకు దూకాడు. క్షణాల్లోనే మంటలు పెద్దవికావడంతో డీమార్టు సిబ్బంది అగ్నిమాపక పరికరాల సాయంతో మంటలను ఆర్పారు. ప్రమాదం కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది.

మరోఘటనలో: నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వైపు కారులో వెళ్తుండగా మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ శివారులో జాతీయ రహదారిపై ఇంజిన్‌ నుంచి పొగలు వచ్చాయి. డ్రైవరు అప్రమత్తమై పక్కకు నిలిపాడు. అందులోని నలుగురు కిందకు దిగి పరిశీలించే లోపు మంటలు వ్యాపించి ఇంజిన్‌ పూర్తిగా కాలిపోయింది. నంబరు ఆధారంగా సికింద్రాబాద్‌కు చెందిన మహ్మద్‌ షహజాన్‌ అలీకి చెందిన కారని గుర్తించారు. నలుగురికి ఎలాంటి గాయాలు కాలేదు.

కాళ్లకల్‌లో కారుకు అంటుకున్న మంటలు

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts