logo

వెంబడించి దొంగను పట్టుకున్న యువకులకు సన్మానం

ఓ మహిళ మెడలోంచి పుస్తెలతాడు లాక్కెళ్లిన వ్యక్తిని వెంబండించి పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఇద్దరు పౌరులను మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి అభినందించారు. కొత్తగూడలోని పార్కులో ఈ నెల 26న ఓ మహిళ వాకింగ్‌ చేస్తుండగా పోలీస్‌ కానిస్టేబుల్‌ కంటు రమేష్‌ (31) ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడు లాక్కొని పారిపోయాడు.

Published : 04 Oct 2022 03:03 IST

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: ఓ మహిళ మెడలోంచి పుస్తెలతాడు లాక్కెళ్లిన వ్యక్తిని వెంబండించి పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఇద్దరు పౌరులను మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి అభినందించారు. కొత్తగూడలోని పార్కులో ఈ నెల 26న ఓ మహిళ వాకింగ్‌ చేస్తుండగా పోలీస్‌ కానిస్టేబుల్‌ కంటు రమేష్‌ (31) ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడు లాక్కొని పారిపోయాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడే వాకింగ్‌ చేస్తున్న షేక్‌ అబ్దుల్‌ ఖరీమ్‌, చల్లోజు అనురాగ్‌లు మోటర్‌ సైకిల్‌పై వెంబడించి దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారి సాహసాన్ని అభినందిస్తూ.. సోమవారం మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి వారిని సన్మానించి నగదు పురస్కారం అందజేశారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts