logo

93 మందికి షీటీమ్స్‌ కౌన్సెలింగ్‌

యువతులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న పోకిరీలపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు షీటీమ్స్‌ డీసీపీ కవిత ధార తెలిపారు. సెప్టెంబరులో కేసుల వివరాలను వెల్లడించారు. ఓ మహిళ ఆన్‌లైన్‌లో ఆహారానికి ఆర్డర్‌ ఇచ్చారు. డెలివరీ బాయ్‌ రాజేశ్‌(20) ఆర్డర్‌ అందజేశాడు.

Updated : 04 Oct 2022 05:11 IST

షీటీమ్స్‌ కౌన్సెలింగ్‌కు హాజరైన యువకులు

ఈనాడు, హైదరాబాద్‌: యువతులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న పోకిరీలపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు షీటీమ్స్‌ డీసీపీ కవిత ధార తెలిపారు. సెప్టెంబరులో కేసుల వివరాలను వెల్లడించారు. ఓ మహిళ ఆన్‌లైన్‌లో ఆహారానికి ఆర్డర్‌ ఇచ్చారు. డెలివరీ బాయ్‌ రాజేశ్‌(20) ఆర్డర్‌ అందజేశాడు. 10 నిమిషాల తర్వాత నుంచి ఫోన్‌ చేసి శారీరకంగా సహకరిస్తే డబ్బు ఇస్తానని వేధించసాగాడు. ఆమె పోలీసుల్ని ఆశ్రయించడంతో రాజేశ్‌ను అరెస్టు చేశారు. ఓ యువతిని దుర్గం చెరువు సమీపంలో ఓ వ్యక్తి అటకాయించి అభస్యంగా మాట్లాడాడు. యువతి మాదాపూర్‌ షీటీమ్స్‌ను ఆశ్రయించారు. వేధించిన వ్యక్తిని నిఫ్ట్‌ విద్యార్థిగా గుర్తించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

సెప్టెంబరులో నమోదైన కేసులు

అందిన ఫిర్యాదులు : 102

డెకాయ్‌ ఆపరేషన్లు : 570

అదుపులోకి తీసుకొని, కౌన్సెలింగ్‌ చేసింది : 93 మంది

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది : 16 మందిని

క్రిమినల్‌ కేసులు : 8 మందిపై

పెట్టీ కేసులు : 19 మందిపై

అడ్డుకున్న బాల్య వివాహాలు : 3

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని