logo

శాంతి సభకు అనుమతివ్వలేదని పాల్‌ ఆమరణ దీక్ష

జింఖానా మైదానంలో ఆదివారం నిర్వహించిన ప్రపంచ శాంతి సభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వలేదని నిరసిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్‌ అమీర్‌పేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆమరణ దీక్ష చేపట్టారు. పాల్‌ మాట్లాడుతూ.. ఎంతోమంది ప్రముఖులు సభకు వస్తున్నారని 106సార్లు చెప్పానని, సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు.

Published : 04 Oct 2022 03:03 IST

దీక్షలో డా.కేఏ పాల్‌

అమీర్‌పేట: జింఖానా మైదానంలో ఆదివారం నిర్వహించిన ప్రపంచ శాంతి సభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వలేదని నిరసిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్‌ అమీర్‌పేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆమరణ దీక్ష చేపట్టారు. పాల్‌ మాట్లాడుతూ.. ఎంతోమంది ప్రముఖులు సభకు వస్తున్నారని 106సార్లు చెప్పానని, సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైఖరికి నిరసనగా ఆమరణ దీక్షకు దిగుతున్నానని తెలిపారు. రాష్ట్రాన్ని దోచుకున్నది సరిపోక ఇప్పుడు దేశాన్ని దోచుకోవడానికి కేసీఆర్‌ కుటుంబం ప్లాన్‌ చేస్తుందని ఆరోపించారు. పోలీసులు కేసీఆర్‌ చేతిలో పావులుగా మారారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని