logo

Hyderabad Metro: వాట్సప్‌లో మెట్రోరైల్‌ టిక్కెట్లు..ఎలా పొందాలంటే..

మెట్రోరైల్‌ ప్రయాణికులు ఇకపై వాట్సప్‌ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చని అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెట్రోరైల్‌ కౌంటర్లలో టిక్కెట్లు కొనేందుకు వరుసలో నిల్చోవాల్సిన అవసరం లేదని వివరించారు.

Updated : 04 Oct 2022 09:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రోరైల్‌ ప్రయాణికులు ఇకపై వాట్సప్‌ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చని అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెట్రోరైల్‌ కౌంటర్లలో టిక్కెట్లు కొనేందుకు వరుసలో నిల్చోవాల్సిన అవసరం లేదని వివరించారు. వాట్సప్‌ ద్వారా డిజిటల్‌ పద్ధతిలో నగదు బదిలీ చేయవచ్చని, దేశంలోనే తొలిసారిగా తాము ప్రయాణికుల సౌకర్యార్థం ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇందుకోసం బిల్‌ఈజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.

మెట్రోస్టేషన్ల వద్ద ఉన్న క్యూర్‌ కోడ్‌ను వాట్సాప్‌ ద్వారా స్కాన్‌ చేసి కూడా టిక్కెట్లు కొనుగోలు చేయొచ్చనిఅధికారులు తెలిపారు.

కొనడం ఇలా..

* మీ నంబర్‌తో 8341146468కు హాయ్‌ చెప్పండి

* ఓటీపీ ఎంటర్‌ చేయాలి

* గమ్యస్థానాన్ని నమోదు చేయాలి

* టిక్కెట్‌ ధరను బదిలీ చేయాలి

* ఈ-టికెట్‌ వస్తుంది

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని