logo

నాంపల్లిలోని భూమి ప్రభుత్వానిదే: హైకోర్టు

నాంపల్లి ఫూల్‌బాగ్‌లోని సర్వే నం.93/1, 93/2, 94లోని 1789 చదరపు మీటర్ల స్థలం ప్రభుత్వానిదేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టినవారిని ఆక్రమణదారులుగా పేర్కొంటూ భూఆక్రమణల నిరోధక ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

Published : 04 Oct 2022 03:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: నాంపల్లి ఫూల్‌బాగ్‌లోని సర్వే నం.93/1, 93/2, 94లోని 1789 చదరపు మీటర్ల స్థలం ప్రభుత్వానిదేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టినవారిని ఆక్రమణదారులుగా పేర్కొంటూ భూఆక్రమణల నిరోధక ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ భూమికి సంబంధించి తహసీల్దార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించి తమను ఆక్రమణదారులుగా పేర్కొంటూ భూఆక్రమణల నిరోధక ప్రత్యేక కోర్టు 2005లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వై.అమృతాభాయ్‌ తదితరులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని విచారించిన జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌, జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఆక్రమణదారులు తమ హక్కులకు సంబంధించి ఎలాంటి ఆధారాలను చూపలేదని స్పష్టం చేసింది. హైకోర్టుకు ఉన్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి ప్రత్యేక కోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను కొట్టేసింది.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts