logo

‘బిట్‌కాయిన్స్‌’ పేరిట రూ.37 లక్షలు స్వాహా

బిట్‌కాయిన్‌ ట్రేడింగ్‌తో లాభాలంటూ రూ.37 లక్షలు దోచేశారంటూ ఓ బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ వివరాల ప్రకారం.. ఓల్డ్‌ బోయిన్‌పల్లికి చెందిన ఏకాంబరం నాగరాజు ఫోన్‌కు ‘బీటీసీ ప్రాఫిటెబులిటీ23’ పేరుతో లింక్‌ వచ్చింది.

Published : 04 Oct 2022 03:03 IST

నారాయణగూడ: బిట్‌కాయిన్‌ ట్రేడింగ్‌తో లాభాలంటూ రూ.37 లక్షలు దోచేశారంటూ ఓ బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ వివరాల ప్రకారం.. ఓల్డ్‌ బోయిన్‌పల్లికి చెందిన ఏకాంబరం నాగరాజు ఫోన్‌కు ‘బీటీసీ ప్రాఫిటెబులిటీ23’ పేరుతో లింక్‌ వచ్చింది. దానిపై క్లిక్‌ చేయగా ఓ వాట్సప్‌ గ్రూప్‌తో అనుసంధానమైంది. ఈ క్రమంలో అవతలి వ్యక్తి చెప్పినట్లు బాధితుడు బిట్‌కాయిన్స్‌లో కొంత డబ్బు పెట్టారు. దానికి సుమారు రూ.100 డాలర్ల లాభం ఇచ్చారు. అనంతరం రూ.37 లక్షల వరకు పెట్టుబడి పెట్టగా.. లాభం తన ఖాతాలో జమకావడం లేదు. దీనిపై అవతలి వ్యక్తిని ప్రశ్నిస్తే.. ఇంకా డబ్బులు పెట్టాలంటూ ఒత్తిడి తెచ్చాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని