logo

‘ఆసరా’ పంపిణీలో అవకతవకలు

ఆసరా పథకం పింఛన్‌ డబ్బుల పంపిణీలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. తాండూరు మండలం సంగెంకలాన్‌లో తపాలా ఉద్యోగి శివ సోమవారం 36 మంది లబ్ధిదారుల వేలిముద్రలను సేకరించారు.

Published : 04 Oct 2022 03:03 IST

తాండూరుగ్రామీణ, న్యూస్‌టుడే: ఆసరా పథకం పింఛన్‌ డబ్బుల పంపిణీలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. తాండూరు మండలం సంగెంకలాన్‌లో తపాలా ఉద్యోగి శివ సోమవారం 36 మంది లబ్ధిదారుల వేలిముద్రలను సేకరించారు. నగదు రూ.2,016 చొప్పున చెల్లించాల్సి ఉండగా, కేవలం వేలిముద్రలతోనే సరిపెట్టారు. లబ్ధిదారులు పింఛన్‌ డబ్బులు ఇవ్వాలని అడిగితే మంగళవారం ఇస్తామని వెళ్లిపోయారని వెల్లడించారు. ఇదే విషయమై సర్పంచి మేఘనాథ్‌ మాట్లాడుతూ.. డబ్బులు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శికి సూచించినట్లు తెలిపారు. లబ్ధిదారులను తపాలా కార్యాలయానికి తరలించి రూ.2,016 చొప్పున చెల్లించగా, వెంటనే గ్రామానికి చెందిన ఓ నాయకుడు తానే మంజూరు చేయించానంటూ ఒక్కొక్క లబ్ధిదారు నుంచి రూ.వెయ్యి చొప్పున వసూలు చేశాడని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని